Mistake OTT: ఓటీటీలోకి కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. ‘మిస్టేక్‌’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

'రామ్‌ అసుర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అభినవ్‌ సర్దార్‌. ఈ మూవీ తర్వాత అతను హీరోగా నటించిన చిత్రం మిస్టేక్‌. భ‌ర‌త్ కొమ్మాల‌పాటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో అజయ్ కతుర్వార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Mistake OTT: ఓటీటీలోకి కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌.. మిస్టేక్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Mistake Movie

Updated on: Oct 12, 2023 | 12:23 PM

‘రామ్‌ అసుర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అభినవ్‌ సర్దార్‌. ఈ మూవీ తర్వాత అతను హీరోగా నటించిన చిత్రం మిస్టేక్‌. భ‌ర‌త్ కొమ్మాల‌పాటి దర్శకత్వం వహించిన ఈ కామెడీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలో అజయ్ కతుర్వార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్, రాజా రవీంద్ర, సమీర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 4 న థియేటర్లలో విడుదలైన మిస్టేక్‌ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రమోషన్స్‌ పెద్దగా నిర్వహించకపోవడంతో పెద్దగా జనాల్లోకి వెళ్లలేకపోయిందీ సినిమా. థియేటర్లలో నిరాశపర్చిన మిస్టేక్‌ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కు రానుంది. శుక్రవారం (అక్టోబర్‌ 13) నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ. అలాగే ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.

మిస్టేక్ కథ కథ ఏంటంటే?

మిస్టేక్‌ సినిమా కథ విషయానికి వస్తే.. జూబ్లీహిల్స్‌ పక్కనే ఉండే ఓ బస్తీలో నివసిస్తూ ఉండే ముగ్గురు కుర్రాళ్లు.. కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం తమ లవర్స్‌తో కలిసి అడవిలోకి బయలుదేరుతారు. అయితే ఈ కారడవిలో వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఇదే సమయంలో తెలియకుండా చేసిన పొరపాట్లు వారిని మరిన్ని చిక్కుల్లో పడేస్తాయి. మరి ఈ సమస్యల నుంచి ముగ్గురు ఎలా బయటపడ్డారన్నది తెలుసుకోవాలంటే మిస్టేక్‌ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌. కాగా ఏఎస్‌ పీ మీడియా హౌస్ బ్యానర్లో తెరకెక్కిన మిస్టేక్ సినిమాకు హీరో అభినవ్ సర్దార్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. మనీ జెన్నా సంగీతం అందించారు. హరి జాస్తి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, విజయ్ ముక్తావరపు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఆహాలో ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.  పాపం పసివాడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మిస్టేక్ మూవీ ట్రైలర్..

రేపటి నుంచే స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..