ఇండియాలో నెంబర్ వన్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఈ సక్సెస్‌ఫుల్ జర్నీలో మరొక సరికొత్త కామెడీ ఫిల్మ్ భాగం కానుంది. ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మై డియర్ దొంగ’. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ ఒరిజినల్ ఫిల్మ్‌కు సంబంధించిన స్నీక్ పీక్‌ను ప్రేక్షకులకు అందించింది ఆహా. ఆహా క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించిన ఈ చిత్రానికి షాలిని కొండెపూడి రచయితగా పనిచేయడం విశేషం. ఇందులో అభినమ్ గోమటం ఓ చిన్న దొంగగా కనిపించాడు. మ్యాగీ ప్యాకెట్ సహా ఎవరూ ఊహించని చిన్న చిన్న వస్తువులను కూడా దొంగతనం చేస్తుంటాడు. మరి అలాంటి దొంగ జీవితంలోకి హీరోయిన్ షాలిని కొండెపూడి ఎలా వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మై డియర్ దొంగ మూవీ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో మంచి ఫన్ ఉందని, ప్రేక్షకులకు రోలర్ కోస్టర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుందంటోంది చిత్రబృందం. ‘టక్కరి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియర్ దొంగ ఎవరో తెలియాలంటే త్వరలో ఆహా ఓటీటీలో చూడాల్సిందే’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.ఈ పోస్టర్‌లో డోర్ చాటుకూ దాక్కొని అభినవ్ గోమఠం కనిపిస్తున్నాడు. శాలిని దేనినో చూసి షాక్ అవుతోన్నట్లుగా పోస్టర్‌లో కనిపిస్తోంది.
ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మై డియర్ దొంగ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ జనవరి నెలాఖరునే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ఆహా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మై డియర్ దొంగ మూవీకి సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మహేశ్వర్ రెడ్డి నిర్మించాడు. అజయ్ అరసాడ సంగీతం అందించారు.
Mee guessulu correct eh…❤️Maggie packets tho paatu, inkem dongathanam cheyabothunnado! @AbhinavGomatam🤩#MyDearDonga, an aha original coming soon…@AnnapurnaStdios #ShaliniKondepudi #camentertainment #maheshwarreddy #mydeardonga #aha #maheshwarreddy #spectrumpostworks pic.twitter.com/oezCYSr9b9
— ahavideoin (@ahavideoIN) December 30, 2023
Adavi Donga vinnaru, Takkari Donga vinnaru, Jebu Donga vinnaru.
Kaani ee My Dear Donga Evaru?
Let’s catch him soon on Aha! @ahavideoIN #ShaliniKondepudi @AnnapurnaStdios #camentertainment #maheshwarreddy #MyDearDonga #comingsoon @sprite_india pic.twitter.com/TIV9szewfo— ahavideoin (@ahavideoIN) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.