
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, యాపిల్ బ్యూటీ హన్సిక జంటగా నటించిన చిత్రం పార్ట్‌నర్. తమిళంలో ఆగస్టు 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడింది. తెలుగులో కూడా ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. అయితే అంతకుముందే పార్ట్‌నర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సింప్లీసౌత్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (అక్టోబర్ 6) అర్ధరాత్రి నుంచే పార్ట్‌నర్ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చింది సింప్లీ సౌత్. కేవలం ఓవర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్రమే పార్ట్‌నర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే తెలుగు, తమిళ ఆడియెన్స్‌కు చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో పార్ట్‌నర్ మూవీ తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్ రిలీజ్ కానుంది. కాగా సైన్స్ ఫిక్షన్ కథకు కాస్త కామెడీని జోడించి ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ మనోజ్‌దామోదరన్. అయితే ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఓ సైంటిస్ట్ తయారు చేసిన చిప్‌ను తన స్నేహితుడు కళ్యాణ్(యోగిబాబు)తో కలిసి దొంగిలించాలని శ్రీధర్ (ఆది పినిశెట్టి) ప్రణాళికలు వేస్తాడు. అయితే ఆ చిప్ కారణంగా కల్యాణ్ అనుకోకుండా అమ్మాయి (హన్సిక)గా మారిపోతాడు. అదే సమయంలో చిప్ వారి వద్ద ఉందని భావించి కొందరు రౌడీలు వారి వెంట పడతారు? మరి రౌడీ గ్యాంగ్ నుంచి శ్రీధర్, కల్యాణ్ ఎలా ప్పించుకున్నారు. కల్యాణ్ పరిస్థితేంటి? అతను మళ్లీ అబ్బాయిగా మారాడా? అన్నది తెలుసుకోవాలంటే పార్ట్‌నర్ సినిమా చూడాల్సిందే.
They’re here. 😍#Partner starring Aadhi, Hansika, and Yogi Babu is OUT NOW and streaming on Simply South worldwide, excluding India.
▶️ https://t.co/VllT9hfBp3#ENGvsNZ #LeoTrailerDay
— Prasadh M (@prasadh_m) October 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.