OTT Movie: తలలు కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో కిల్లర్.. ఓటీటీలో పిచ్చెక్కించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రతి వారం ఓటీటీల్లో ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒకటి, రెండూ కచ్చితంగా స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది.

OTT Movie: తలలు కట్ చేసి ఎత్తుకెళ్లే సైకో కిల్లర్.. ఓటీటీలో పిచ్చెక్కించే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie

Updated on: Aug 01, 2025 | 5:38 PM

సాధారణంగా సీరియల్ కిల్లర్ లేదా సైకో కిల్లర్ సినిమాలు ఒకే నేపథ్యంలోనే సాగుతాయి. కిల్లర్ ఒక మోటివ్ తో హత్యలు చేయడం, వీటిని ఛేదించేందుకు, కిల్లర్ ను పట్టుకునేందునుకు పోలీసులు రంగంలోకి దిగడం.. దాదాపు ఇలాంటి కథలే ఉంటాయి. అయితేనేం ఓటీటీ ఆడియెన్స్ ను ఈ జానర్ చిత్రాలే ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి సినిమాలు, సిరీస్ లు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీరియస్ గా సాగుతాయి. ట్విస్టులు కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ కూడా ఇదే కోవకు చెందినదే. ఒక పల్లెటూరిలో ఈ స్టోరీలో హైలైట్ ట్విస్టులు చాలానే ఉన్నాయి. ఐఎమ్ డీలో ఈ సిరీస్ కు 7.1/10 రేటింగ్ ఉండడం విశేషం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో బలగఢ్ అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఈ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నేరాలు కూడా పెద్దగా జరగవు. పోలీసులు కూడా తమ పనేదో చేసుకుంటుంటారు. అయితే ఒక రోజు ఊరిలో ఒక చిన్న దొంగతనం కేసు, ఒక వ్యక్తి మిస్సింగ్ కేసు నమోదవుతాయి. అదే సమయంలో ఊరిలో తలలేని శవం దొరుకుతుంది. దీంతో కథ భయంకరమైన మలుపు తిరుగుతుంది. పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి.

ఊళ్లో జరిగే నేరాల వెనక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత పోతారు. అతను బయటికి అమాయకంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల ఒక భయంకరమైన క్రిమినల్ దాగి ఉంటాడు. ఊరిలో వరుస హత్యలకు పాల్పడుతాడు. ఎలాగోలా పోలీసులు ఆ కిల్లర్ ను పట్టుకుంటారు. కానీ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వడు. మరి ప్రశాంతమైన గ్రామంలో వరుస హత్యలకు పాల్పడిన ఆ కిల్లర్ ఎవరు? అతని మోటివ్ ఏంటి? ఎందుకీ హత్యలకు పాల్పడ్డాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

 

ఈ వెబ్ సిరీస్ పేరు బిభీషణ్. ఇదొక బెంగాలీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. క్రైమ్ డ్రామా, సైకలాజికల్ థ్రిల్లర్‌లు ఇష్టపడేవాళ్లు తప్పక చూడాల్సిన సిరీస్. ఈ సిరీస్‌కు తెలుగు డబ్బింగ్ లేనప్పటికీ, తెలుగు సబ్‌టైటిల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి