OTT Movie: 73 అవార్డ్స్.. 120 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద ప్రేమకథ సంచలనం.. ఇప్పుడు ఓటీటీలో..

ఓటీటీలో ఈమధ్యకాలంలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక జనాల్లో క్లాసిక్ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. క్లాసిక్ ప్రేమకథలకు జనాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ షేక్ చేసిన అందమైన ప్రేమకథ గురించి మీకు తెలుసా.. ?

OTT Movie: 73 అవార్డ్స్.. 120 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద ప్రేమకథ సంచలనం.. ఇప్పుడు ఓటీటీలో..
Jodhaa Akbar

Updated on: Jun 16, 2025 | 4:16 PM

సాధారణంగా సినీరంగంలో ప్రేమకథ చిత్రాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో లవ్ స్టోరీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక క్లాసిక్ ప్రేమకథల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ జానర్ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే దాదాపు 17 ఏళ్ల క్రితం విడుదలైన ఈ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా.. ? అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఆ చిత్రం రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వివిధ విభాగాల్లో 73 అవార్డులు గెలుచుకుంది. ఆ సినిమా మరెదో కాదు.. జోధా అక్బర్. 2008లో హృతిక్ రోషన్ నటించిన సినిమా ఇది. ఇందులో ఐశ్వర్యరాయ్, సోనుసూధ్ కీలకపాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్, గ్రాండియర్ తో ప్రతిక్షణం ఈ మూవీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఉత్తమ చారిత్రక చిత్రాల జాబితాలో ఉంది. ఇందులో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ దాదాపు 200కిలోల వరకు బంగారు నగలను ధరించిందట. 2008లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. కేవలం 45 కోట్లో బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే 73 అవార్డులకు నామినేట్ అయ్యింది. అందులో 38 అవార్డులు గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

అంతేకాకుండా ఈ చిత్రానికిగానూ డిజైనర్ నీతా లుల్లా జాతీయ అవార్డులలో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డ్ అందుకుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. ఈ సినిమాలోని ప్రతీ సీన్, బీజీఎమ్, సాంగ్స్ మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి.

ఇవి కూడా చదవండి :  

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..

Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..