OTT Movie: 16 ఆస్కార్ నామినేషన్లతో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్.. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూశారా?

సినిమా రంగానికి సంబంధించి ఆస్కార్ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అలాంటి ప్రెస్టేజియస్ అవార్డులకు సంబంధించి ఏకంగా 16 విభాగాల్లో ఈ మూవీ నామినేట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: 16 ఆస్కార్ నామినేషన్లతో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్.. ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూశారా?
Sinners Movie

Updated on: Jan 24, 2026 | 7:55 PM

ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ 2026 నామినేషన్స్ అధికారికంగా అనౌన్స్ అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ సినిమా హోమ్‌బౌండ్ చిత్రం ఈ జాబితాలో దక్కించుకోలేక పోయింది. అయితే ఈ సంవత్సరం రికార్డ్ బ్రేకింగ్ నామినేషన్స్ తో ఒక సినిమా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే చర్చ. ఓటీటీలోనూ ఈ మూవీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మార్చి 15 నుంచి జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ సినిమాకు ఎన్ని అవార్డులు రావొచ్చన్న దానిపై ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు ఆడియెన్స్. ఇదొక అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ. 2025న ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సుమాఉ $90 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం $368 మిలియన్ గ్లోబల్ కలెక్షన్స్ సాధించింది ఈ మూవీ. ఇక గతేడాది చివరిలో ఓటీటీస్ట్రీమింగ్ కు వచ్చిన ఈ అమెరికన్ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 1932లో జాతి వివక్ష ఎక్కువగా ఉండే మిసిసిపీ డెల్టా ప్రాంతంలో జరుగుతుంది. ఎలిజా స్మోక్ మూర్, ఎలియాస్ స్టాక్ మూర్ అనే ట్విన్ బ్రదర్స్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఆ తర్వాత చికోగా వెళతారు. అక్కడ అక్రమ వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించి సొంతూరుకు తిరిగిస్తారు. అప్పటివరకు ఉన్న తమ నేర చరిత్రను మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలనుకుంటారు. అందుకోసం తమ ఊరి బయట ఉన్న ఒక పాత మిల్‌ను కొనుగోలు చేసి దానిని ఒక మ్యూజిక్ క్లబ్ గా మారుస్తారు. అయితే ఆ క్లబ్ నుంచి వచ్చే మ్యూజిక్ కారణంగా ఒక రోజు రాత్రి అత్యంత ప్రమాదకరమైన వ్యాంపైర్లు బయటకు వస్తాయి. మరి ఆ క్రూరమైన వాంపైర్లు, అలాగే ఆ ప్రాంతంలోని జాతి వివక్ష చూపే వ్యక్తుల నుంచి ఈ సోదరులిద్దరూ ఎలా తప్పించుకున్నారు? ఊరి ప్రజలను ఎలా కాపాడారన్నదే ఈ సినిమా కథ.

ఇవి కూడా చదవండి

ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సిన్నర్స్’. ప్రతిష్ఠాత్మక వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించారు. మైఖేల్ బి. జోర్డాన్ ట్విన్ బ్రదర్స్ గా నటించారు. అలాగే హైలీ స్టెయిన్‌ఫెల్డ్, మైల్స్ కాటన్, జాక్ ఓ’కానెల్, వున్మి మొసాకు, జేమ్ లాసన్, ఒమర్ మిల్లర్, డెల్రాయ్ లిండో తదితరులు వివిధ పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి