AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ బరిలో గోంధల్.. బడా సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.. అసలు ఈ సినిమాలో ఏముంది

2027 ఆస్కార్‌ల కోసం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ సమర్పణలకు సెప్టెంబర్ 30, 2026 వరకు గడువు ఉంది. షార్ట్‌లిస్ట్ డిసెంబర్ 15, 2026న, తుది నామినేషన్లు జనవరి 21, 2027న ప్రకటించనున్నాయి. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.

ఆస్కార్ బరిలో గోంధల్.. బడా సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.. అసలు ఈ సినిమాలో ఏముంది
Gondhal
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2026 | 9:19 PM

Share

ఆస్కార్ 2027: 99వ అకాడమీ అవార్డ్స్‌కు భారత్ తరఫున అధికారిక ఎంట్రీ ఖరారైంది. మరాఠీ భాషలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ గోంధల్ ప్రతిష్టాత్మక బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున పోటీ చేయనుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) సెప్టెంబర్ 18న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మొత్తం 33 భారతీయ చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు గోంధల్ ను ఎంపిక చేసింది. ఆస్కార్ 2027 కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీని ఎంపిక చేసేందుకు వివిధ భారతీయ భాషలకు చెందిన 33 చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటిలో హిందీ సినిమాలు 14 ఉండగా.. మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల నుంచి నాలుగు చొప్పున చిత్రాలు ఉన్నాయి. తమిళం నుంచి మూడు సినిమాలు, ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా పరిశీలనకు వచ్చాయి.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ చిత్రాలను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ పరిశీలించింది. చివరకు దర్శకుడు సంతోష్ దవాఖర్ తెరకెక్కించిన గోంధల్ ను అధికారిక ఎంట్రీగా ప్రకటించింది. మహారాష్ట్రలోని సంప్రదాయ గోంధల్ ఆచారం, జానపద కళా సంప్రదాయం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఒక రాత్రి జరిగే పరిణామాల చుట్టూ కథనం తిరుగుతూ.. ప్రేమ, వివాహం, కోరిక, నమ్మకం, మోసం, సంప్రదాయం వంటి అంశాలను థ్రిల్లర్ శైలిలో చూపిస్తుంది. సుమన్ అనే మహిళ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు, ఆమెకు సంబంధించిన సంబంధాల చుట్టూ కథలో ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సాధారణ కుటుంబ కథగా మొదలయ్యే సినిమా క్రమంగా థ్రిల్లర్‌గా మారుతుంది.

ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

గోంధల్ దర్శకుడు సంతోష్ దవాఖర్కు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయనకు సిల్వర్ పీకాక్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. అలాగే 2026 పుణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. సినిమాలో కిశోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, నిషాద్ భోయిర్, యోగేశ్ సోహోనీ తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘గోంధల్’ 2025 నవంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. గోంధల్ ఎంపికతో ఆస్కార్‌లో భారత్ తరఫున అధికారికంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందిన మరాఠీ సినిమా సంఖ్య నాలుగుకు చేరింది. గతంలో ‘శ్వాస్’ , ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’ , ‘కోర్ట్’ సినిమాలు భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us