Oscar 2024: బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‏కి నామినేట్ అయిన ‘టు కిల్ ఏ టైగర్ ‘.. ఈ భారతీయ సినిమా గురించి తెలుసా ?..

భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‏గా నామినేట్ అయ్యింది టు కిల్ ఏ టైగర్. దీంతో ఇప్పుడు ఈ మూవీ గురించి గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటీ ?.. నటీనటులు ఎవరు ?.. అనే విషయాలను గూగుల్లో జల్లెడ పట్టేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి.. కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయి విజేతగా నిలిచింది.

Oscar 2024: బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‏కి నామినేట్ అయిన టు కిల్ ఏ టైగర్ .. ఈ భారతీయ సినిమా గురించి తెలుసా ?..
To Kill A Tiger

Updated on: Jan 24, 2024 | 8:54 AM

96వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ ఎట్టకేలకు రివీల్ అయ్యింది. ఈఏడాది ఆస్కార్ పురస్కారాలను గెలుచుకునేందుకు భారత్ నుంచి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‏గా నామినేట్ అయ్యింది టు కిల్ ఏ టైగర్. దీంతో ఇప్పుడు ఈ మూవీ గురించి గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటీ ?.. నటీనటులు ఎవరు ?.. అనే విషయాలను గూగుల్లో జల్లెడ పట్టేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి.. కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతేడాది ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ అయి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ మూవీ కెనడియన్ ఫీచర్ ఫిల్మ్ గా యాంప్లిఫై వాయిస్ అవార్డ్ అందుకుంది.

ఝార్ఖండ్ లోని ఒక మారుమూల పల్లెలో పదమూడేళ్లపై అమ్మాయి ఆత్యాచారానికి గురవుతుంది. తన కూతురిని అపహరించి.. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయి తండ్రి రంజిత్ అనే వ్యక్తి జరిపిన న్యాయ పోరాటమే ఈ డాక్యుమెంటరీ. ఈ చిత్రాన్ని కార్నెలియా ప్రిన్సిప్, డేవిడ్ ఒపెన్ హీమ్ నిర్మించారు. ఆస్కార్‌లకు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో బోబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, ఫోర్ డాటర్స్, 20 డేస్ ఇన్ మారిపోల్ చిత్రాలతో పోటీపడుతుంది టు కిల్ ఏ టైగర్.

తన కూతురిపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయ పోరాటం చేస్తాడు రంజిత్ అనే తండ్రి. అయితే ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడతారు. కానీ ఆ ముగ్గురు యువకులు గ్రామంలో ఉండే నాయకుల పిల్లలు కావడంతో.. కేసును ఉపసంహరించుకోవాలని రంజిత్ పై ఒత్తడి తీసుకువస్తారు గ్రామస్తులు. అయితే రంజిత్ మాత్రం వెనకడుగు వేయకుండా తన బిడ్డకు న్యాయం చేయడం కోసం ఒంటరి పోరాటం చేస్తాడు. చివరకు ఊరంతా ఏకమైన రంజిత్ కేసును వెనక్కు తీసుకోడు. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.