Shruthi Haasan: నట వారసత్వం అండగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార శృతీ హాసన్. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తన ట్యాలెంట్‌తోనే పేరు సంపాదించుకుంది శృతీ. నటిగా, సింగర్‌గా దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శృతీ హాసన్ ప్రస్తుతం మళ్లీ సినిమాల్లో వేగాన్ని పెంచేసింది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే శృతీ నటిస్తోన్న చిత్రమే సలార్.
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతీ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్, కేజీఎఫ్‌తో దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన ప్రశాంత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సలార్‌పై ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గుట్లుగానే ప్రశాంత్ సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం శృతీ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ శృతీ పాత్రను పరిచయం చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సలార్‌లో శృతీ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో శృతీహాసన్ ఆద్యా పాత్రలో కనిపించనుంది. శృతీ హాసన్ లుక్‌ను పోస్ట్ చేసిన ప్రశాంత్ నీల్.. శృతీ హాసన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సలార్‌లో భాగమైనందుకు, సినిమా సెట్స్‌కు ఉత్సాహానికి తీసుకొచ్చింది ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ జోడించారు.
Tomato Coriander Rice: పిల్లలు ఇష్టంగా తినే టమాటా కొత్తిమీర రైస్ కేవలం 15 నిమిషాల్లోనే చేయండి ఇలా
Goa Election 2022: నా పోరాటం కేవలం బీజేపీపైనే.. ఉత్పల్ పారికర్ కీలక వ్యాఖ్యలు..