శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీపై ప్రకటన

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Mar 21, 2019 | 2:55 PM

వరుస విజయాలతో కోలీవుడ్‌లో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తదుపరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించనున్నాడు. శివకార్తికేయన్ 17వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది జూలై నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది. అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. దీనికి ‘వెట్రి నిశ్చయం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో […]

శివకార్తికేయన్ నెక్ట్స్ మూవీపై ప్రకటన

వరుస విజయాలతో కోలీవుడ్‌లో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తదుపరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించనున్నాడు. శివకార్తికేయన్ 17వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది జూలై నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది విడుదల కానుంది. అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. దీనికి ‘వెట్రి నిశ్చయం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కాగా శివకార్తికేయన్ నటించిన ‘మిస్టర్ లోకల్’ మే1న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ‘నక్షత్రం’, ‘హీరో’, ‘ఎన్ పేరు పడయప్ప’ అనే మూవీలలో నటించనున్నాడు ఈ హీరో.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu