హీరోగా ఎన్టీఆర్ బావమరిది!

హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బావమరిది..? ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు

  • Tv9 Telugu
  • Publish Date - 8:45 am, Sun, 16 August 20
హీరోగా ఎన్టీఆర్ బావమరిది!

NTR brother-in-Law: హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బావమరిది..? ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు, లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్‌ కథలను వింటున్నట్లు సమాచారం. మరి ఈ విషయం ఎన్టీఆర్‌కి తెలుసో లేదో తెలీదు గానీ ప్రయత్నాలు మాత్రం ప్రారంభం అయినట్లు టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నితిన్‌కి మంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంది. మరి ఇందులో నిజమెంత..? నితిన్‌ని టాలీవుడ్‌కి ఎవరు పరిచయం చేస్తున్నారు..? నితిన్‌ ఎంట్రీపై ఎన్టీఆర్ అభిప్రాయం ఏంటి..? తదితర ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తుండగా.. ఆ తరువాత త్రివిక్రమ్‌, ప్రశాంత్‌ నీల్‌లతో పనిచేయనున్నారు.

Read More:

చెర్రీతో కోలీవుడ్‌ టాలెంటెడ్ డైరెక్టర్‌!

గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా