‘మహర్షి’ మళ్లీ వాయిదా పడింది

|

Mar 06, 2019 | 4:51 PM

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా కచ్చితంగా 25నే విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల స్పష్టం చేసింది. అంతలోనే సినిమా మళ్లీ వాయిదా పడినట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మార్చి 17కి టాకీ పార్ట్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు. మరో […]

‘మహర్షి’ మళ్లీ వాయిదా పడింది
Follow us on

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా కచ్చితంగా 25నే విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల స్పష్టం చేసింది. అంతలోనే సినిమా మళ్లీ వాయిదా పడినట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. మార్చి 17కి టాకీ పార్ట్‌ పూర్తవుతుందని పేర్కొన్నారు. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుందని తెలిపారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అల్లరి నరేశ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.