అఖిల్ సరసన ‘మెంటల్’ బ్యూటీ!

అఖిల్ అక్కినేని తన నాలుగవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నెలాఖరు నుంచి మొదలుకానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మొదట రష్మిక మందన్నా… ఆ తర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. కానీ అవి వట్టి రూమర్స్‌గానే తేలిపోయాయి. ఇక ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లోకి తమిళ నటి నివేదా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి […]

  • Ravi Kiran
  • Publish Date - 4:07 am, Mon, 8 July 19
అఖిల్ సరసన 'మెంటల్' బ్యూటీ!

అఖిల్ అక్కినేని తన నాలుగవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నెలాఖరు నుంచి మొదలుకానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మొదట రష్మిక మందన్నా… ఆ తర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. కానీ అవి వట్టి రూమర్స్‌గానే తేలిపోయాయి.

ఇక ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లోకి తమిళ నటి నివేదా పేతురాజ్ పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నివేదా ఇటీవల విడుదలైన ‘చిత్రలహరి, బ్రోచేవారెవరురా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా ఈమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక అఖిల్ సినిమాలో కూడా ఆమెను ఫైనల్ చేస్తారో లేకపోతే లేదో అనేది చూడాలి.