మెంటల్ మదిలో సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ నటి నివేదా పేతురాజ్. గతేడాది వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నటిస్తున్న రెడ్ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిక విషయాలను బయటపెట్టింది ఈ కోలీవుడ్ భామ. మీ కెరీర్‌ను ఎలా ప్లాన్ చేసుకున్నారు అని ప్రశ్నించగా.. తెలుగులో మంచి పేరు తెచ్చుకోవడానికి అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. ఓ హీరోయిన్గా అన్ని రకాల పాత్రలు ఎందుకు చేయకూడదు. నాకు లేడీ విజయ్ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పింది. అలాగే ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారని అడగ్గా.. ఓ తమిళ సినిమా చేస్తున్న.. చందూమొండేటి వెబ్ చిత్రం చేస్తున్నా.. విరాటపర్వంలో స్పెషల్ అప్పియరెన్స్‌లో నటిస్తున్నాను. అలాగే విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న పొగల్ మూవీలో ఓ మాస్ పాత్రలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. చాలా కాలం క్రితం కిశోర్ తిరుమలతో పనిచేశా.. ప్రస్తుతం రెడ్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తానని చెప్పింది.
Also Read:
Hero Arya: విజయ్ సేతుపతి స్థానంలోకి నటుడు ఆర్య ?.. తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..