Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌ బ్రేకింగ్‌: నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం!

టాలీవుడ్ నటుడు నిఖిల్ నటించిన "ది ఇండియన్ హౌజ్" సినిమా షూటింగ్ సమయంలో శంషాబాద్ లోని షూటింగ్ స్థలంలో నీటి ట్యాంకర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్ తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు కూడా గాయపడ్డారు. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

బిగ్‌ బ్రేకింగ్‌: నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం!
Nikhil
Follow us
SN Pasha

|

Updated on: Jun 11, 2025 | 11:14 PM

టాలీవుడ్‌ ప్రముఖ హీరో నిఖిల్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. శంషాబాద్‌లో “ది ఇండియన్‌ హౌజ్‌” సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. వాటర్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో ఒక్కసారిగా లోకేషన్‌ మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరికొంత మందికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారందరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.