Industryసినిమా ఫీల్డ్‌లో నయా ట్రెండ్స్! ఐతే విక్టిమ్‌ కార్డ్.. లేదంటే సోషల్ ట్రోల్స్!

ట్రోలింగ్‌లో మళ్లీ రెండు రకాలు. ఒకటి.. ఫ్యాన్స్ వార్‌లో భాగంగా జరుగుతుంటుంది. రెండో రకం ట్రోలింగ్.. కొందరు సినిమా వాళ్లే, మరో సినిమాపై చేయిస్తుంరు. ఇది మహా డేంజర్. ఆ ఒక్క సినిమాని చంపేయడం కాదు మొత్తం ఇండస్ట్రీనే ముంచేసే డర్టీ కల్చర్ అది. కాకపోతే.. ట్రోలింగ్స్‌ను కూడా పబ్లిసిటీ స్ట్రాటజీగా వాడుకుంటున్నారు కొందరు దర్శక నిర్మాతలు. ఏదోకరకంగా తమ సినిమాని నలుగురి నోళ్లలో నానేలా చేయడానికి ఈ విపరీత పోకడలను పెంచి పోషిస్తున్నారు

Industryసినిమా ఫీల్డ్‌లో నయా ట్రెండ్స్! ఐతే విక్టిమ్‌ కార్డ్.. లేదంటే సోషల్ ట్రోల్స్!
New Trends In Film Industry

Updated on: Oct 14, 2025 | 10:11 PM

‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా’ అన్నాడో డైరెక్టర్. ఆ డైలాగ్‌తో సినిమాని బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. సినిమా రిలీజ్ అయింది. బట్.. నెగటివ్ టాక్ వచ్చింది. చెప్పినట్టుగానే చెప్పులను చేతుల్లోకి తీసుకున్నాడు. మూవీ ప్రమోషన్‌లో కొట్టుకుంటానంటూ డైలాగ్ కొట్టడం అటెన్షన్ గ్రాబింగ్‌లో భాగమా? సినిమాను థియేటర్లలోంచి రెండో రోజుకే తీసేయకుండా ఆ డైలాగ్‌నే చేతల్లో చూపించడం గేమ్ ప్లే చేశారా అని అన్నవాళ్లూ లేకపోలేదు. ఆ సినిమా డైరెక్టర్‌ని అనడం కాదు గానీ.. టాలీవుడ్ ఈ మధ్య ఈ దారిలోనే వెళ్తోంది. దీనికున్న పేరు..’విక్టిమ్ కార్డ్’. అయ్యో, అమ్మో అని బాధపడిపోవడమో, చిటికన వేలుపై వెంట్రుక కూడా పీకలేరనడమో, ట్రోల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇవ్వడమో, మమ్మల్ని తొక్కేస్తున్నారు అనడమో.. దీన్నే ప్రమోషన్స్‌గా అప్లై చేస్తున్నారు. ఎవరో తమను ట్రోల్ చేస్తున్నారని బాధపడిపోవడం కంటే.. తమను తాము ట్రోల్ చేసుకుని, లేదా ‘మేం బాధితులం’ అని సింపతీ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఒక కొత్త ట్రెండ్‌లా కనిపించడం లేదూ..! ఈ మెథడ్ అప్లై చేసి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమా కూడా ఉంది. ఇక నాణేనికి మరోవైపు చూద్దాం. ట్రోల్స్‌తో నిజంగానే ఎదుటి సినిమాను చంపేస్తున్న బ్యాచ్ కూడా తయారైంది టాలీవుడ్‌లో. ఓజీ రిలీజ్‌కు ముందు పవన్ కల్యాణ్ అన్నది, నిన్న బన్నీ వాసు మాట్లాడింది ఈ ట్రోల్స్ గురించే. ఓవరాల్‌గా టాలీవుడ్‌లో రెండు ట్రెండ్స్ నడుస్తున్నాయిప్పుడు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి