
యదార్థ సంఘటనల ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో జరిగిన ఎన్నో కీలక సంఘటనలకు సంబంధించి సంఘటనలకు సంబంధించి వెండి తెరపై సినిమాలు సందడి చేశాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ రూపంలో ఇలాంటి రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలంటి ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ మరిచిపోలేని ఓ హైజాక్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ పేరుతో రానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తిగా ఉన్న ఈ ట్రైలర్ వెబ్ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది. కథ విషయానికొస్తే.. 1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు.
ఆ సమయంలో విమానంలో 188 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది ఉన్నారు. సుమారు వారం రోజుల పాటు వీళ్లంతా ఉగ్రవాదుల బంధీలోనే ఉన్నారు. ఈ నిజ సంఘటను ఆధారంగా చేసుకొని అనుభవ్ సిన్హా దృశ్యారూపాన్ని స్తున్నారు. ఆ సమయంలో విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌లలో కొద్దిసేపు ల్యాండింగ్ చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో విమాన్ని తీసుకెళ్లారు.
ఆ తర్వాత ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి విమానం సేఫ్‌గా ఎలా బయటపడింది లాంటి వివరాలను వెబ్ సిరీస్‌లో చూపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 29వ తేదీ నుంచి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇందులో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షాతో పాటు పలువురు నటించారు. దేశాన్ని కుదిపేసిన హైజాక్ నేపథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..