Netflix: రామ్‌ చరణ్‌, చిరును కలిసిన నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ.. కారణం అదేనా.?

ఆ మాటకొస్తే ట్రిపులార్‌ సినిమా విజయంతో రామ్‌ చరణ్‌ క్రేజ్‌ ఖండంతరాలు దాటిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా చెర్రీ కెరీర్‌ గ్రాఫ్‌ను కూడా ఆమంతం పెంచేసింది. ఇక ఈ సినిమా ఏకంగా ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డును సైతం గెలుచుకోవడంతో రామ్‌ చరణ్‌ గ్లోబల్ ఆడియన్స్‌కు కూడా చేరువయ్యారు...

Netflix: రామ్‌ చరణ్‌, చిరును కలిసిన నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ.. కారణం అదేనా.?
Ram Charan

Updated on: Dec 08, 2023 | 3:25 PM

ట్రిపులార్‌ సినిమాతో రామ్‌ చరణ్‌ క్రేజ్‌ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అంతకు ముందు తెలుగులో భారీ విజయాలను అందుకున్నా ట్రిపులార్‌ సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో చెర్రీకి క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమాతో చెర్రీ ఒక్కసారిగా పాన్‌ ఇండియా హీరోగా మారాడు.

ఆ మాటకొస్తే ట్రిపులార్‌ సినిమా విజయంతో రామ్‌ చరణ్‌ క్రేజ్‌ ఖండంతరాలు దాటిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా చెర్రీ కెరీర్‌ గ్రాఫ్‌ను కూడా ఆమంతం పెంచేసింది. ఇక ఈ సినిమా ఏకంగా ఆస్కార్‌ బరిలో నిలిచి అవార్డును సైతం గెలుచుకోవడంతో రామ్‌ చరణ్‌ గ్లోబల్ ఆడియన్స్‌కు కూడా చేరువయ్యారు.

ఈ క్రమంలోనే.. రామ్‌ చరణ్‌తో హాలీవుడ్ మేకర్స్ సినిమా తీసేందుకు మొగ్గు చూపుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మరోసారి చెర్రీ హాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన వార్తలకు బలాన్ని చేకూర్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కో-సీఈవో టెడ్ సరాండొస్‌ తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు.

చిరు ఫ్యామిలీని కలిసిన టెడ్‌ సరాండొస్‌..

హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే.. సరాండొస్‌ నేరుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రామ్‌ చరణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, నిర్మాత శోభు యార్లగడ్డ ఉన్నారు. వీరితో భారత్‌లో తమ తదుపరి ప్రణాళికల గురించి, వ్యాపార విస్తరణ, సినిమాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టెడ్‌ సరాండొస్‌ మెగా ఫ్యామిలీని కలిసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఈ భేటీతో చెర్రీ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ప్రాజెక్ట్ చేయనున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..