Nazriya Nazim: నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 23న విడుదల అవుతుంది ఈ మూవీ. టక్ జగదీష్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ సంకీర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగులో జాయినైంది నజ్రియా నజీమ్ . ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. తెలుగులో తన ఫస్టు సినిమా ‘అంటే .. సుందరానికీ’ కనుక, తనకి ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.
It was a great start for my first telugu Film ♥️? First is always special.
Ante Sundaraniki will be special ❤️? #AnteSundaraniki
— Nazriya Nazim Fahadh (@Nazriya4U_) April 19, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.