Hit 2 Movie: హిట్‌ 2పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నాని.. విడుదల తేదీ ప్రకటిస్తూ ట్వీట్‌..

|

Sep 15, 2022 | 7:05 PM

Hit 2 Movie: శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది...

Hit 2 Movie: హిట్‌ 2పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన నాని.. విడుదల తేదీ ప్రకటిస్తూ ట్వీట్‌..
Hit 2 Movie
Follow us on

Hit 2 Movie: శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. విశ్వక్‌సేన్‌ తనదైన నటనతో ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హిట్2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాను న్యాచురల్ స్టార్‌ నాని సమర్పిస్తుండడం విశేషం.

ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంటో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2021 ఈ సినిమా షూటింగ్ మొదలుకాగా అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నాని స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను ట్వీట్ చేసిన నాని.. ‘డిసెంబర్‌ 2వ తేదీన, సెకండ్ కేస్‌’ అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ ఎదురుపూలుకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది. ఈ సినిమాలో అడివి శేష్‌కు జోడిగా. మీనాక్షి చౌద‌రి నటిస్తుండగా.. రావు రమేశ్‌, భాను చంద‌ర్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్లభ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లీ ప్రసాద్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..