AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : ఇంటర్నేషనల్ ఇక్కడ.. తగ్గేదేలా.. ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై అల్లు అర్జున్..

జాతీయ అవార్డు గ్రహీత, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఫోర్బ్స్ ఇండియా తాజాగా షో స్టాపర్స్ 2026 పేరుతో 100 మంది ప్రముఖ సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే 2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమా, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ తదితర రంగాల్లో విశేష ప్రభావం చూపించిన వారిని జాబితాలో ఎంపిక చేశారు.

Allu Arjun : ఇంటర్నేషనల్ ఇక్కడ.. తగ్గేదేలా.. ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై అల్లు అర్జున్..
Allu ArjunImage Credit source: Forbes India
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 6:22 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 పేరుతో ప్రత్యేక సంచిక విడుదల చేసింది. ఈ సంచిక కవర్ పేజీపై బన్నీ మెరిశారు. తనదైన స్టైల్, ఆకట్టుకునే లుక్ తో కవర్ పేజీపై కనిపించారు బన్నీ. దీంతో ఈసారి జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో తనకున్న క్రేజ్ చాటుకున్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులు, సినిమాలోని కథ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. “ఉత్తరాది, దక్షిణాది సినిమా లేదా మరే ఇతర ప్రాంతీయ సినిమా అయినా సరే.. బాక్సాఫీస్ వద్ద ఆదరణ పొందాలంటే కథే ప్రధానం” అని అన్నారు. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా హిట్ అవుతుందని.. కొత్త కథను ప్రేక్షకులకు అందించడమే అన్నిటికంటే ముఖ్యమని అన్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా సినిమాల్లోని నటీనటుల స్టార్ డమ్ కంటే కూడా సరైన కథే చిత్ర విజయాన్ని నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ వంటి చిత్రాలతో ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటారు బన్నీ. తనదైన నటనతో, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ తో ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాల్లో తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుండగా.. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఇదిలా ఉంటే.. 20258 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్.. ఇలా వివిధ రంగాల్లో ప్రభావం చూపిన 100 మంది తారల జాబితాను షోస్టాపర్స్ 2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఇందులో ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు చోటు సంపాదించుకున్నారు. అల్లు అర్జున్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, రజినీకాంత్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, దుల్కర్ సల్మన్, మాధవన్ , రిషబ్ శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ వంటి నటీనటులు ఇందులో ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us