Vikram Movie: “విక్రమ్” సినిమాపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్.. కమల్ కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్..

|

Jul 03, 2021 | 3:58 PM

తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం "విక్రమ్". ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Vikram Movie: విక్రమ్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్న డైరెక్టర్.. కమల్ కోసం మరో నేషనల్ అవార్డు విన్నర్..
Vikram Movie
Follow us on

తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లెటేస్ట్ చిత్రం “విక్రమ్”. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ముందు నుంచి ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ విక్రమ్ సినిమా కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు.

నేషనల్ అవార్డు అందుకున్న గిరీష్ గంగాధరన్ మలయాళం సూపర్ హిట్ చిత్రాలు.. నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి, గుప్పీ, అంగమలీ డైరీస్, జల్లికట్టు సినిమాలకు పనిచేశారు. ఇవేకాకుండా.. తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మురగదాస్ సర్కార్ సినిమాకు కూడా పనిచేశారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే… ఇప్పటికే ఈ సినిమా కోసం నేషనల్ అవార్డు గెలుచుకున్న స్టంట్ కో-ఆర్డినేటర్స్ అన్బరివ్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇక శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తోన్న “ఇండియన్ -2” సినిమా గురించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, డైరెక్టర్ శంకర్ మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించిన కమల్.. మధ్యలోనే ఆ వివాదం నుంచి తప్పుకున్నారు. దీంతో కమల్ ఇప్పుడు “విక్రమ్” సినిమాపైనే ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: PIB Fact Check : కొవిడ్ రిలీఫ్ కింద ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.4 వేలు అందిస్తుందా..! అసలు విషయం ఏంటో తెలుసుకోండి..

సినీ,క్రీడా సెలబ్రెటీలకే కాదు పొలిటికల్ లీడర్స్‌కు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. జనాదరణలో స్టాలిన్ అగ్రస్థానం

Monsoon Food: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. సీజనల్ వ్యాధులను తగ్గించే ఆహారపదార్థాలు ఇవే..