నానీ ‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ: ఫ్యాన్స్ మిక్సెడ్ రెస్పాన్స్..!

| Edited By:

Sep 13, 2019 | 1:50 PM

టైటిల్: ‘నానీ గ్యాంగ్ లీడర్’ యాక్టర్స్: నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌, రఘుబాబు డైరెక్టర్: విక్రమ్ కే కుమార్ బేనర్: మైత్రీ మూవీ మేకర్స్ మ్యూజిక్: అనిరుథ్ రవిచందర్ ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అదే టైటిల్‌తో ఇప్పుడు నాని.. మనముందుకు ఓ గ్యాంగ్‌ని వేసుకుని వచ్చేశాడు. ట్రైలర్ చూస్తుంటేనే.. కాస్త కామెడీగా.. మరికొంత […]

నానీ గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ: ఫ్యాన్స్ మిక్సెడ్ రెస్పాన్స్..!
Follow us on

టైటిల్: ‘నానీ గ్యాంగ్ లీడర్’
యాక్టర్స్: నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌, రఘుబాబు
డైరెక్టర్: విక్రమ్ కే కుమార్
బేనర్: మైత్రీ మూవీ మేకర్స్
మ్యూజిక్: అనిరుథ్ రవిచందర్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అదే టైటిల్‌తో ఇప్పుడు నాని.. మనముందుకు ఓ గ్యాంగ్‌ని వేసుకుని వచ్చేశాడు. ట్రైలర్ చూస్తుంటేనే.. కాస్త కామెడీగా.. మరికొంత సస్పెన్స్‌గా ఉంది. అంతేకాదు.. ఈ సినిమాలో.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరిలు నిర్మించారు. మంచి టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నాని గ్యాంగ్‌ లీడర్ మూవీ టాక్‌ ఎలా ఉంది..? ఎంత అల్లరి చేశాడో.. తెలుసుకుందామా..!

కథ: ఓ బ్యాంక్‌లో 300 కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. కేవలం ఆరుగురు వ్యక్తులు 18 నిమిషాల్లో బ్యాంకులోని డబ్బును మాయం చేస్తారు. అయితే.. ఆ చోరీ గ్యాంగ్‌లోనే.. ఒకడు ఐదుగురిని చంపి.. డబ్బంతా ఎత్తికెళ్లిపోతాడు. ఆ ఐదుగురుకి సంబంధించిన ఆడవాళ్లు.. ఎలాగైనా.. వాడెవడో.. తెలుసుకొని పగ తీర్చుకోవాలని ట్రై చేస్తూంటారు. ఈ క్రమంలో వారికి నాని ఎదురవుతాడు. నాని కూడా.. వారి చోరీ కేసును.. కథగా రాసి మంచి రచయితగా అవ్వాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో.. సాగుతున్న కథలో కొన్ని అనుకోని ట్విస్టులు ఎదురవుతాయి..? మొత్తానికి నాని గ్యాంగ్.. ఆ హంతకుడిని పట్టుకున్నారా..? కార్తికేయకు హత్యకు సంబధమేమిటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ: విచిత్రాల దర్శకుడిగా.. విక్రమ్ కే కుమార్‌కి మంచి పేరు ఉంది. కథను ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో.. చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్‌లో కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ ఉండటంతో.. కడుపుబ్బా నవ్విస్తూనే ఏడిపించేశాడు. మొదట స్లోగా.. సినిమా మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు మనకు పరిచయం అవుతూ.. కథ సాగుతూ ఉంటుంది. మెల్ల.. మెల్లగా.. ఊపందుకుంటుంది. ఇక అక్కడక్కడ వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. వెన్నెల కిషోర్‌కి.. చాలా రోజుల తర్వాత మంచి టైమింగ్ దొరికింది.. ఇంకేంటి.. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాడు. నవ్వులతో.. అలా సాగిపోతున్న కథలోకి ఓ ట్విస్ట్‌ని ఇస్తూ.. ఇంటర్‌వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. మంచి స్క్రీన్‌ ప్లేతో ప్రీ క్లైమాక్స్ వరకూ ఒక్కో సన్నివేశం భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే.. కథను సాగతీసే ప్రయత్నంలో కాస్త తడబడ్డాడు డైరెక్టర్. దీంతో.. కాస్త నిరాశగా ఉందంటున్నారు ఫ్యాన్స్.

నటీనటులు: ఎప్పటిలాగే.. నాని తన పాత్రకు న్యాయం చేశాడు. ఒక విలన్‌ రోల్‌లో కార్తికేయ లుక్స్‌తో పాటు యాక్టింగ్ సూపర్. మిగతా తారగణం.. ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌, రఘుబాబు అందరూ చక్కగా నటించారు.

ప్లస్ పాయింట్స్:

నాని నటన
కార్తికేయ నటన
కామెడీ
నేపథ్య సంగీతం
కథ
సెంటిమెంట్

మైనస్ పాయింట్స్:

కథనం
స్క్రీన్‌ప్లే
సన్నివేశాల సాగతీత
ప్రేక్షకుడి అంచానాలకు అందలేదు
విక్రమ్ కే కుమార్ మార్క్ లేకపోడం