నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ పాత్రలో నటించి మెప్పించాడు. ఐదురుగు ఆడవాళ్లు తమకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు. వీరికి నాని ఎలా సహాయపడ్డాడు, ఆ మహిళా గ్యాంగ్ లీడర్‌కు నాయకుడు ఎలా అయ్యాడన్న కథాంశంతో ఈ సినిమాను విక్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడు.
పెన్సిల్ పార్థసారథి అనే రచయిత పాత్రలో నాని తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమా విజయంలో నాని పాత్ర ఎంత ఉందో మహిళల పాత్ర కూడా అంతే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పాప నుంచి బామ్మ వరకు అందరూ తమ పగను తీర్చుకోవడానికి నాని వెన్నంటే ఉండి నడుస్తుంటారీ సినిమాలో. వీరిలో హీరోయిన్‌తో పాటు ఓ చిన్నారి పాత్రలో శ్రియా రెడ్డి నటించింది. తన పాత్ర మేరకు మంచి నటనను కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించిందీ చిన్నరి. ఇక సినిమా షూటింగ్ పూర్తికాగానే శ్రియా రెడ్డి మళ్లీ ఎక్కడా కనిపించలేదు.
కనీసం సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొనలేదు శ్రియా రెడ్డి. సినిమా షూటింగ్ పూర్తికాగానే అమెరికాలోని బోస్టన్‌కి వెళ్లి పోయింది శ్రియా. అయితే తాజాగా అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి శ్రియా రెడ్డి తాజాగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన శ్రియా రెడ్డి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గ్యాంగ్ లీడర్‌లో టీనేజ్‌లో కనిపించిన శ్రియా ప్రస్తుతం హీరోయిన్ రేంజ్‌కు చేరింది. దీంతో శ్రియో రెడ్డి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రియారెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 9వ తరగతిలోనే చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని చెప్పుకొచ్చిన శ్రియా.. తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి థియేటర్‌లో నటించానని తెలిపింది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు, శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేసిన సమయంలో.. అక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తనను చూసి దర్శకుడు విక్రమ్‌కు ఫఞటోలు పంపాడని చెప్పుకొచ్చింది. దీంతో ఆ ఫొటోలు చూసిన విక్రమ్ గ్యాంగ్ లీడర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..