నేచురల్ స్టార్ నాని (Nani).. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్( Rahul Sankrityan) కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్'(Shyam Singha Roy). సాయి పల్లవి (Sai Pallavi), కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. కలకత్తా బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ భాషలలో మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం. ఈ సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ హనుమ విహారి వంటి ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురిపించిన వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సీన్ ను ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్..
ఈ సన్నివేశం అలరిస్తుండగానే సినిమాలో మరో తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇది కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో శ్యామ్ సింగరాయ్ జ్ఞాపకాల్లోకి వెళుతున్న వాసుని చూపించారు. డైలాగ్స్ ఏమీ లేనప్పటికీ.. రోశీ (సాయిపల్లవి) కోసం వాసు అవతారంలో ఉన్న శ్యామ్‌గా నాని అద్భుతంగా నటించారు. మొదటి డిలీటెడ్ సీన్ లో లాగే ఇందులో కూడా వేశ్యలకు సంబంధించిన ఓ హార్ట్ టచింగ్ సన్నివేశాన్ని జత చేశారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సన్నివేశాన్ని హైలెట్ చేస్తోంది. మరి నెటిజన్లను అలరిస్తోన్న ఈ ఎమోషనల్ సీన్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
Also read: Railway Jobs: ఐటీఐ అర్హతతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయంటే..
Punjab Elections: నవజ్యోత్ సింగ్ సిద్దూపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్!
Parenting Tips: మీ పిల్లలు ఎత్తు పెరగాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ పాటించండి..