కామెడీ.. లవ్.. థ్రిల్లింగ్.. ‘గ్యాంగ్‌లీడర్’ టీజర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 24, 2019 | 12:02 PM

‘జెర్సీ’తో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాచులర్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్‌లో తన పేరు పెన్సిల్‌గా పరిచయం చేసుకున్న నాని.. తాను రివేంజ్ స్టోరీలను రాసేవాడిగా పేర్కొన్నాడు. ఆ తరువాత అతడి లైఫ్‌లోకి ఐదుగురు లేడీస్ రావడంతో ఆయన జీవితం ఎలా మారింది […]

కామెడీ.. లవ్.. థ్రిల్లింగ్.. ‘గ్యాంగ్‌లీడర్’ టీజర్
Follow us on

‘జెర్సీ’తో ఈ ఏడాది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాచులర్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది.

టీజర్‌లో తన పేరు పెన్సిల్‌గా పరిచయం చేసుకున్న నాని.. తాను రివేంజ్ స్టోరీలను రాసేవాడిగా పేర్కొన్నాడు. ఆ తరువాత అతడి లైఫ్‌లోకి ఐదుగురు లేడీస్ రావడంతో ఆయన జీవితం ఎలా మారింది అనే కథనంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు టీజర్‌లోనే స్పష్టం చేశాడు దర్శకుడు. ఇక టీజర్ మొత్తం కామెడీతోనే నిండగా.. అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మొదటి నుంచి ఈ  సినిమాపై ఉన్న అంచనాలను టీజర్ మరింత పెంచేసింది.

కాగా ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీష్ కురివిల్ల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, రఘుబాబు, సత్య, ప్రణ్య, జైజా తదితరులు కీలక పాత్రలలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీకి అనిరుథ్ సంగీతాన్ని అందించాడు. మొదట ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. అయితే అదే రోజు ప్రభాస్ నటించిన సాహో కూడా వస్తుండటంతో.. ఈ సినిమాను ముందుగా కానీ, ఆ తరువాత గానీ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్‌లో కూడా చిత్ర యూనిట్ త్వరలో అని పేర్కొనడం విశేషం.