Nagababu: గరికపాటి ఎపిసోడ్‌కు నాగబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం.. ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌..

|

Oct 07, 2022 | 9:11 PM

గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి...

Nagababu: గరికపాటి ఎపిసోడ్‌కు నాగబాబు ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం.. ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌..
Nagababu Garikapati Issue
Follow us on

గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మెగా అభిమానులతో పాటు నాగబాబు చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అయ్యింది. దీంతో ఈ అంశం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. అభిమానులు చిరంజీవితో ఫొటోలు దిగుతుండగా గరికపాటి అసహనం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నెట్టింట పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి.

దీంతో ఈ రచ్చకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు నాగబాబు. గరికపాటిని ఉద్దేశిస్తూ తాను చేసిన ట్వీట్‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తాజాగా మరో ట్వీట్‌ చేశారు నాగబాబు. ట్వీట్‌ చేస్తూ.. ‘ గరికపాటి వారు ఏదో మూడ్‌లో అలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి కానీ.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్’ అంటూ రాసుకొచ్చారు. మరి నాగబాబు ట్వీట్‌తో అయినా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్‌ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఈ అంశం చర్చకు దారి తీసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..