Naga Chaitanya: ఆ క్షణం ఎంతో బాధపడ్డాను, గుండెకు గట్టిగా తాకింది.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నాగచైతన్య..

|

Aug 13, 2022 | 3:39 PM

Naga Chaitanya: అక్కినేని కుటుంబ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నాగచైతన్య. జోష్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చై.. తొలి సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో...

Naga Chaitanya: ఆ క్షణం ఎంతో బాధపడ్డాను, గుండెకు గట్టిగా తాకింది.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నాగచైతన్య..
Follow us on

Naga Chaitanya: అక్కినేని కుటుంబ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు నాగచైతన్య. జోష్‌ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చై.. తొలి సినిమా ద్వారా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే తర్వాత తనని తాను మార్చుకుంటూ లవ్‌ స్టోరీలు, మాస్‌ మూవీస్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో విజయాలతో పాటు అపజయాలు సైతం ఎదుర్కున్నాడు. తాజాగా లాంగ్‌ సింగ్‌ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు చై. లాల్‌ సింగ్‌ చడ్డా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన చైతన్య ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

జోష్‌ సినిమా విడుదల సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్న నాగచైతన్య.. ‘జోష్‌ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల రియాక్షన్‌ ఎలా ఉంటుందో నేరుగా తెలుసుకోవడానికి థియేటర్‌కు వెళ్లాను. సినిమా ప్రారంభమైన మొదట్లో అందరూ బాగానే ఎంజాయ్‌ చేశారు. కానీ సినిమా సగానికి వచ్చేసరికి చాలా మంది థియేటర్‌ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనించాను. ఆ సమయంలో చాలా బాధేసింది, అది నా గుండెను గట్టిగా తాకింది. ప్రేక్షకుల్ని అలరించడం నా వల్ల సాధ్యం కావడం లేదనిపించింది. ఆ సంఘటన నాకెన్నో విషయాలు నేర్పించింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ థియేటర్‌కు వెళ్లలేదు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి.. ప్రేక్షకుల రియాక్షన్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటా’ అని చెప్పుకొచ్చాడు చైతన్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..