AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priya Prakash Varrier: “ఆ ట్రోల్స్, మీమ్స్ నన్ను చాలా బాధించాయి”.. ఎమోషనల్ అయిన వింక్ గర్ల్

ఓవర్ నైట్ లో స్టార్  అయ్యిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆ ఫేమ్ ను కాపాడుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటున్న వారు కొందరు ఉన్నారు.

Priya Prakash Varrier: ఆ ట్రోల్స్, మీమ్స్ నన్ను చాలా బాధించాయి.. ఎమోషనల్ అయిన వింక్ గర్ల్
Priya Prakash
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2022 | 3:38 PM

Share

Priya Prakash Varrier: ఓవర్ నైట్ లో స్టార్  అయ్యిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆ ఫేమ్ ను కాపాడుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా మలుచుకుంటున్న వారు కొందరు ఉన్నారు. వారిలో ఈ అందాల భామ కూడా ఒకరు. ఒక్కసారి కన్ను గీటి కుర్రాళ్ళ మనస్సులో స్థానం సంపాధించుకుంది వయ్యారి భామ ప్రియా ప్రకాష్ వారియర్. మళయాలంలో తెరకెక్కిన ఒరు అదార్ లవ్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. అదే సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రియా ప్రకాష్ కన్ను గీటుతుంది. ఆ సీన్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. కుర్రాలంతా ఆ సీన్ కు ఫిదా అవ్వడమే కాదు సోషల్ మీడియాను కూడా షేక్ చేశారు. అయితే తాజాగా ఓ ఇంట్రవ్యూలో ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ.. ఆ సీన్ గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.

ప్రియా ప్రకాష్ మాట్లాడుతూ.. కన్నుగీటే  సీన్ నాకు చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ ఒక్క సీన్ తో నాకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది అంది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తనకు కేవలం 18 సంవత్సరాలే అని తెలిపింది ప్రియా ప్రకాష్. అయితే ఆ సీన్ తో ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతే నెగిటివిటి కూడా వచ్చింది అన్నారు. చాలా మంది ఆ సీన్ ను రకరకాలుగా వాడుకొని నన్ను ట్రోల్ చేశారు. ఆసమయంలో నా పై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ నన్ను చాలా భాదపెట్టాయి. అంతే కాదు ఆ సీన్ కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి అని చెప్పుకొచ్చింది ప్రియా. ఇక ప్రియా ప్రకాష్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు పలు మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా.. తన గ్లామర్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత తేజ సజ్జ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముడుగుమ్మ రకరకాల ఫొటోలతో మతిపోగొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు