Prabhas And Nag Ashwin Movie Update: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో ఓ సినిమా తీయబోతున్నానని డేట్స్‌తో సహ ప్రకటించాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇందులో నటి దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.
ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తానని నాగ్ అశ్విన్ ఈ సంవత్సరం ఆరంభంలో చెప్పారు. అయితే పండగ వెళ్ళి పదిరోజులు కావోస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్లో మీమ్స్ మరియు కామెంట్లు చేస్తున్నారు. దీంతో నాగ్ అశ్వీన్ స్పందిస్తూ… “జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న ఒకటి.. కచ్చితంగా అప్డేట్లు ఉంటాయని” సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం ‘సలార్’ మూవీ చిత్రీకరణ కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అలాగే ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.
Prabhas – Nag Ashwin updates… https://t.co/qtddlG7YsI
— ChaiBisket (@ChaiBisket) January 23, 2021
Also Read:
Prabhas’s Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని భయం