OTT Movie: ఆ నగలను ధరిస్తే కాటికి పోయినట్టే.. ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
పురాణాలు, మిస్టరీ, హారర్ అంశాల కలయికలో వచ్చిన కాంతార, విరూపాక్ష తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోన్న సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారం తెలుగు వెబ్ సిరీస్ లు పెద్ద ఎత్తున రిలీజ్ కానున్నాయి. సూపర్ సుబ్బు, మర్మదేశం, ఇసకపట్నం వంటి సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. వీటితో పాటు అబ్సెషన్ సినిమా కూడా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ఇదే క్రమంలో గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ సినిమా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పురాణాలు, మిస్టరీ, హారర్.. ఇలా ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ 1800ల కాలంలో మొదలవుతుంది. ఆ కాలంలో ఒక పాలకుడు చేసిన క్రూరమైన పనుల ఒక శక్తివంతమైన దుష్టశక్తి ఉద్భవిస్తుంది. తరాలు మారిపోతున్నా, ఏళ్లు గడిచిపోతున్నా ఆ శాపం ఆ కుటుంబాన్ని వెంటాడుతుంటుంది.
రాజ కుటుంబానికి చెందిన ఫ్యామిలీకి వారసత్వంగా వస్తున్న నగలలో ఆ శాపం ఉంటుంది. ఆ నగలను ఎవరూ ధరించనంతవరకూ ఆ దుష్టశక్తి నిద్రాణంగా ఉంటుంది. ఎవరైతే ఆ నగలను ధరించారో వాళ్లను మాత్రం నానా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. అలాంటి ఆ దుష్టశక్తి నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడిందనేదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ పేరు ‘తవ్వై’ (Tavvai). నిర్భయ్ జారివాలా, జయేష్ వృషీరాజ్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ హిందీ సినిమాలో మనోజ్ జోషి, భూషణ్ ప్రధాన్, తృప్తి సాహు, అర్పిత రంకా, నీతూ పాండే, సురేందర్ శర్మ, కీర్తికా గుప్తా, స్పందన పల్లి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడే చూడాలనుకుంటే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
Tavvai ka mayajaal jitna gehra hai utna hi khatarnak!
Watch #Tavvai, now streaming on #JioHotstar pic.twitter.com/Fl81aospEc
— JioHotstar (@JioHotstar) June 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




