AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బుర్రపాడు చేసే స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ సైకలాజికల్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ గత వారమే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

OTT Movie: బుర్రపాడు చేసే స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 22, 2026 | 8:07 PM

Share

ఈ శుక్రవారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. ది ఒడిస్సీ, ప్రేమనే ఊరిలో, కికూ చిరంజీవి, కల్ట్, అనుపమ క్రేజీ కల్యాణం, అన్బిల్ అవన్, హైకూ, అనుమాన పక్షి, చిరం, 418, మయూఖ వంటి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఇప్పుడు ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓటీటీలోకి వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. భారీ స్ట్రీమింగ్ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఇదొక తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదలైంది. కంటెంట్ కొత్తగా ఉన్నా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆడలేదు. అయితే థియేట్రికల్ రిలీజ్ చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియెన్స్ మెప్పు పొందుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. ఒక దట్టమైన అడవి నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. సీత అనే ఒక మహిళ తన కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటుంది. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని ఘటనలతో ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉన్నట్లుండి భర్త కనిపించకుండా పోతాడు. ఇదే క్రమంలో ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకున్న సురుళి అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వస్తాడు. వీరిద్దరూ కలిసి ఉండగానే సీత జీవితంలోకి మళ్లీ భర్త వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?పగ, విషాదం మధ్య ముగ్గురి జీవితం ఎలా మలుపులు తీసుకుంది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు సాయవనం (Saayavanam). ఇదిక సైకలాజికల్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సీత పాత్రలో దేవనంద షాజిలాల్ , భర్త ముత్తు పాత్రలో సౌందర రాజా నటించారు. వీరితో పాటు సంతోష్ దామోదరన్, అప్పుకుట్టి, జానకి జయరామన్, వెట్రివేల్ రాజా, మాథ్యూ మాంప్రా తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. డామర్ సినిమా బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ ఈ సినిమాను నిర్మించారు. పాలీ వర్గీస్ సంగీతం అందించారు. ప్రస్తుతం సాయవనం సినిమా ప్రముఖ ఓటీటీ తెలుగు ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

సాయవనం సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బుర్రపాడు చేసే స్టోరీ..OTT టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్
బుర్రపాడు చేసే స్టోరీ..OTT టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్
ఇద్దరన్నదమ్ములు.. 3 మామిడిపండ్లను సమానంగా ఎలా తిన్నారో తెలుసా?
ఇద్దరన్నదమ్ములు.. 3 మామిడిపండ్లను సమానంగా ఎలా తిన్నారో తెలుసా?
వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
వచ్చేస్తున్నాయ్‌.. పాడ్‌ కార్స్‌ ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా
ఏఐతో పెరగనున్న నిరుద్యోగం ..? ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కా
విమానాశ్రయంలో లగేజీ బ్యాగులపై గోధుమ రంగు జిగట పదార్థం! ఏంటది?
విమానాశ్రయంలో లగేజీ బ్యాగులపై గోధుమ రంగు జిగట పదార్థం! ఏంటది?
గుండె డాక్టర్ అరుదైన రికార్డ్...
గుండె డాక్టర్ అరుదైన రికార్డ్...
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
బట్టల దుకాణంలో వీధికుక్కలకు ఆశ్రయం.. యజమాని పెద్ద మనసు
పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 - ఏ వయసులో ఏం తినాలో తెలుసా?
పురుషుల డైట్ సీక్రెట్! 20, 40, 60 - ఏ వయసులో ఏం తినాలో తెలుసా?
అమ్మ వైపు బంధువులతోనే అనుబంధం ఎక్కువగా ఎందుకుంటుందో తెలుసా? 
అమ్మ వైపు బంధువులతోనే అనుబంధం ఎక్కువగా ఎందుకుంటుందో తెలుసా? 
NEFT ద్వారా రోజులో ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు?
NEFT ద్వారా రోజులో ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు?