లైంగిక వేధింపుల కేసు.. అనురాగ్ కశ్యప్‌కి సమన్లు

లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌కి ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు

లైంగిక వేధింపుల కేసు.. అనురాగ్ కశ్యప్‌కి సమన్లు

Edited By:

Updated on: Sep 30, 2020 | 3:47 PM

Anurag Kashyap Summons: లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌కి ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం ఉదయం 11 గంటలకు వెర్సోవా పోలీస్ స్టేషన్‌కి రావాలని అందులో పేర్కొన్నారు.

అయితే 2014లో అనురాగ్‌ కశ్యప్‌ తనపట్ల అనుచితంగా వ్యవహరించారంటూ నటి పాయల్ ఘోషల్ ఆరోపించారు. ఇక ఆమె ఆరోపణలపై ఆమె ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అనురాగ్‌పై 376(1), 354, 341, 342 సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. మరోవైపు ఈ సమన్లపై అనురాగ్ కశ్యప్ లాయర్ ప్రియాంక ఖిమని స్పందిస్తూ.. అసత్య ఆరోపణలు తన క్లైంట్‌ని చాలా బాధించాయని అన్నారు. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని ఆమె వెల్లడించారు.

Read More:

క్రేజీ కాంబో.. రానాతో రొమాన్స్ చేయనున్న శ్రుతీ

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులుగా పద్మశ్రీ డా.శోభరాజు