సుశాంత్‌తో మీ కాంట్రాక్ట్ కాపీ ఇవ్వండి: ‘యశ్‌రాజ్’ను కోరిన పోలీసులు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్‌కి సన్నిహితంగా ఉన్న పలువురిని ప్రశ్నించిన

సుశాంత్‌తో మీ కాంట్రాక్ట్ కాపీ ఇవ్వండి: యశ్‌రాజ్ను కోరిన పోలీసులు

Edited By:

Updated on: Jun 19, 2020 | 4:33 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును వేగవంతం చేశారు ముంబయి పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్‌కి సన్నిహితంగా ఉన్న పలువురిని ప్రశ్నించిన పోలీసులు తాజాగా ప్రముఖ యశ్‌రాజ్‌ సంస్థకు నోటీసులు పంపారు. సుశాంత్‌తో మీరు చేసుకున్న కాంట్రాక్ట్ కాపీని మాకు ఇవ్వండి అంటూ యశ్‌రాజ్‌ సంస్థను గురువారం పోలీసులు అడిగారు.

కాగా ‘కాయ్‌ పో చే’ చిత్రం ద్వారా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్, యశ్‌రాజ్‌ ఫిలింస్‌తో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ నిర్మాణ సంస్థలో సుశాంత్ రెండు సినిమాల్లో(శుధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ భ్యోమ్‌కేష్ భక్షి) నటించారు. ఇవి రెండు మంచి విజయాలు కూడా సాధించాయి. అయితే ఆ తరువాత యశ్‌రాజ్ సంస్థ, సుశాంత్‌తో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు ఆఫర్లు రాకుండా చేసిందన్న టాక్ నడిచింది. ఈ క్రమంలోనే పోలీసులు, సుశాంత్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ కాపీని ఇవ్వమన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో 8 మంది ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో యశ్‌ రాజ్‌ సంస్థ కూడా ఉన్న విషయం తెలిసిందే.

Read This Story Also: మరో కీలక ఒప్పందం చేసుకున్న జగన్ సర్కార్