‘లవర్స్ డే’ సినిమా రివ్యూ

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 6:27 PM

చిన్న క‌న్నుగీటితో.. గన్ షూట్ తో.. రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో ఫేమ‌స్ అయిపోయింది ప్రియా ప్ర‌కాష్. అలాగే.. ఈ సినిమా టీజర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రేజ్‌తో ఈమె న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`. ఇదే సినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తెలుగులో ఈ చిత్రం `ల‌వ‌ర్స్ డే`గా ప్రేమికుల రోజున విడుద‌లైంది. మ‌రి […]

‘లవర్స్ డే’ సినిమా రివ్యూ
Follow us on

చిన్న క‌న్నుగీటితో.. గన్ షూట్ తో.. రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో ఫేమ‌స్ అయిపోయింది ప్రియా ప్ర‌కాష్. అలాగే.. ఈ సినిమా టీజర్ కూడా ఒక రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రేజ్‌తో ఈమె న‌టించిన తొలి మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆడార్ ల‌వ్‌`. ఇదే సినిమాను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో కూడా విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తెలుగులో ఈ చిత్రం `ల‌వ‌ర్స్ డే`గా ప్రేమికుల రోజున విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

కథ : ఇంటర్మీడియట్ కాలేజీ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. రోష‌న్ , ప్రియా వారియ‌ర్‌, గాథా జాన్, పవన్ అంద‌రూ డాన్ బాస్కో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో ఒకే క్లాస్లో చ‌దువుతుంటారు. ప్రియ‌ను ఆట‌ప‌ట్టించాల‌ని రోష‌న్ ఆమెను టీజ్ చేస్తాడు. క్ర‌మంగా అది వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కు దారి తీస్తుంది. వాళ్లు లవ్ చేసుకుంటున్న విషయం మొత్తం స్కూల్లో అంతా పాకేస్తుంది. కాగా.. వాట్లాప్ లో పెట్టిన కొన్ని వీడియోల వల్ల రోషన్, ప్రియల మధ్య బ్రేకప్ అవుతుంది. ఈ తరుణంలో ఒకానొక స‌మ‌యంలో రోష‌న్ ఫ్రెండ్ చేసిన చిన్న త‌ప్పు వ‌ల్ల రోష‌న్ ప్రిన్సిపాల్ ముందు దోషిగా నిలుచోవ‌ల‌సి వ‌స్తుంది. అయితే.. ఆ స‌మ‌యంలో ప్రియ అత‌నికి స‌పోర్ట్ చేయ‌దు. ముందు నుంచీ అత‌నికి స‌పోర్ట్ చేసే గాథ స‌పోర్ట్ చేస్తుంది. అయితే.. ప్రియ, రోషన్ లను కలపడానికి రోషన్ అతని ఫ్రెండ్స్ గాథ, రోషన్ లు లవ్ చేసుకుంటున్నట్లు నటించమంటారు. వారు కూడా అలాగే నటిస్తారు. న‌ట‌న‌గా మొద‌లుపెట్టిన వారి ప్రేమ నిజ‌మ‌వ‌సాగుతుంది. ఆ క్ర‌మంలో ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

యాక్టింగ్ : ప్రియా క‌న్నుకొట్టే స‌న్నివేశంతో పాపుల‌ర్ అవ‌డంతో ఆమె సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా మారింది. అయితే మ‌రో క‌థానాయిక నూరిన్ షెరిఫ్ కూడా సినిమాలో త‌న అందంతో ఆక‌ట్టుకున్నారు. ప్రియాకి దీటుగా క‌నిపించారు. ఒక ద‌శ‌లో నూరిన్ పాత్రే ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. న‌ట‌నప‌రంగా కూడా ఆమె ఆక‌ట్టుకుంటారు. రోష‌న్ న‌ట‌న‌లో వైవిధ్యం ఏమీ చూపించ‌లేదు. ఎప్పుడూ న‌వ్వుతూ క‌నిపిస్తుంటాడు. మొత్తానికి వీళ్ల యాక్టింగ్ బాగానే ఉంటుంది.

చివరకు: కాలేజీ వాతావరణంలోనే నడిచే స్టోరి కాబట్టి.. ఆల్ రెడీ చూసిన కథలానే అనిపించింది లవర్స్ డే సినిమా. హ్యాపీడేస్, చిత్రం వంటి చిత్రాలను గుర్తు చేసింది. కాకపోతే కొంచెం కొత్తదనం యాడ్ అయింది. సినిమాలో కథ అనేది మిస్సయింది. కొద్ది వరకూ బాగానే అనిపించినా.. సినిమా మొత్తం అర్థంకానట్టు అనిపిస్తుంది. అసలు రోషన్, ప్రియలు బ్రేకప్ ఎందుకయ్యారో కూడా అర్థవంతంగా లేదు. అలాగే.. రోషన్ అసలు ప్రిన్సిపల్ దగ్గర ఎందుకు నిలుచోవల్సి వచ్చిందో సరిగా చెప్పేందుకు డైరెక్టర్ ప్రయత్నించలేదు. కాకపోతే రోషన్, ప్రియల లవ్ సీన్ బాగుంటుంది. సినిమాలో ప్రత్యేకమంటూ ఏమీ లేదు. కామెడీ కూడా ట్రూ చేసినట్టు ఉంది తప్ప నవ్వులు తెప్పించలేదు. కానీ.. సెకండాఫ్ లో లాస్ట్ సీన్స్ బావుంటాయి.