AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12A Railway Colony Movie Review: 12ఏ రైల్వే కాలనీ రివ్యూ..! అల్లరి నరేష్ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..

అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా 12ఏ రైల్వే కాలనీ. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించాడు. సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ రైల్వే కాలనీ ఆడియన్స్‌ను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

12A Railway Colony Movie Review: 12ఏ రైల్వే కాలనీ రివ్యూ..! అల్లరి నరేష్ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..
12a Railway Colony Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 21, 2025 | 4:35 PM

Share

మూవీ రివ్యూ: 12ఏ రైల్వే కాలనీ

నటీనటులు: అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, జీవన్, సాయి కుమార్, వైవా హర్ష తదితరులు

సినిమాటోగ్రఫర్: కుశేందర్ రమేష్ రెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరాలియో

నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్

కథ, కథనం, మాటలు: అనిల్ విశ్వనాథ్

ఎడిటర్, దర్శకుడు: నాని కాసరగడ్డ

కథ:

కార్తిక్ (అల్లరి నరేష్) వరంగల్‌లో రాజకీయ నాయకుడు టిల్లు అన్న (జీవన్) దగ్గర పని చేస్తుంటాడు. ఉప ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో టిల్లు అన్న చెప్పిన పని చేస్తుంటారు. అదే సమయంలో తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి ఇష్టపడతాడు.. ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమించేలా చేయడానికి తన ప్రయత్నాలేవో తాను చేస్తుంటాడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అనుకోకుండా ఆరాధనని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆమెతో పాటు వాళ్ల అమ్మను కూడా దారుణంగా మర్డర్ చేస్తారు. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రైమ్ సస్పెక్ట్ కింద కార్తిక్‌నే పట్టుకుంటారు. ఆ కేసును హ్యాండిల్ చేసే రానా ప్రతాప్ (సాయికుమార్) సాయంతో కార్తిక్ అందులోంచి బయటపడతాడు.. కానీ ఆ మర్డర్ ఎవరు చేసారనేది అసలు ట్విస్ట్. అదే మెయిన్ స్టోరీ కూడా..

కథనం:

కొన్నిసార్లు తమ సినిమా గురించి దర్శక నిర్మాతలు చెప్పే మాటలు ప్రేక్షకులను మాయలో పడేస్తుంటాయి. వాళ్ల ప్రాడక్ట్ కాబట్టి అలాగే అనిపిస్తుంది కానీ అందులో ఎన్ని లొసుగులు ఉన్నాయనేది రిలీజ్ వరకు కూడా తెలియదు. ఇప్పుడు 12ఏ రైల్వే కాలనీ కూడా ఇదే బాపతు సినిమా. పొలిమేర హ్యాంగోవర్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమా చేసానన్నాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.. కానీ ఇంకా అందులోనే ఉన్నాడు.. కాకపోతే చేతబడులు వదిలేసాడంతే. 5 నిమిషాల క్లైమాక్స్ ట్విస్ట్ కోసం.. 2 గంటల సినిమా తీసాడేమో అనిపించింది. ముఖ్యంగా ప్రతీ 5, 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని దర్శకుడు చెప్పడమే కానీ అందులో అంతగా అయితే ఏం లేవు. ఉన్న ట్విస్టులు కూడా ఎక్కడో చూసినట్లుగానే అనిపిస్తాయి. పైగా అందులో లాజిక్స్ కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి. రన్ టైమ్ 2.05 గంటలే కానీ.. ముందుకెళ్లకుండా అక్కడే మొరాయించింది సినిమా.. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ అయితే ఎంతకీ కదల్లేదు.. ఇంటర్వెల్ వరకు అక్కడే ఆగింది. మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఇచ్చినా.. సెకండాఫ్ మళ్లీ అదే తంతు.. అక్కడక్కడే తిరిగే కథ.. మళ్లీ మళ్లీ వచ్చే సీన్స్.. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే.. ఇవన్నీ రైల్వే కాలనీని రాంగ్ స్టేషన్‌కు తీసుకెళ్లిపోయాయి. పొలిమేరలో చాలా సీన్స్ భయపెడతాయి.. కానీ అలాంటి టీం నుంచి వచ్చిన ఈ చిత్రంలో మాత్రం కమర్షియల్ అంశాలే ఉన్నాయి కానీ జెన్యూన్‌గా భయపెట్టే సీన్స్ మాత్రం ఒక్కటి కూడా లేవు. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు అన్నారు కానీ ఆ రేంజ్ కాకపోయినా పర్లేదు.. మరీ వాళ్లు చెప్పినట్లుగా ఇండియన్ సినిమాలోనే రాలేనంత క్లైమాక్స్ ఏం కాదు. అల్లరి నరేష్ కామెడీ చేసినపుడే బాగుండేది.. అప్పుడే అతన్ని వెతుక్కుంటూ డిఫెరెంట్ కథలు వచ్చేవి.. కానీ ఇప్పుడాయన వెతుక్కుంటూ వెళ్తుంటే ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు.

నటీనటులు:

అల్లరి నరేష్‌కు నటుడిగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఏదైనా కూడా అదరగొడుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఇక కామాక్షి భాస్కర్ల పర్లేదు.. బాగా నటించింది. మిగిలిన పాత్రల్లో వైవా హర్ష, జీవన్, గెటప్ శ్రీను, సద్దాం పర్లేదు. మిగిలిన వాళ్లు ఓకే..

టెక్నికల్ టీం:

భీమ్స్ సంగీతం బాగుంది.. పాటలు, రీ రికార్డింగ్ కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ పర్లేదు.. ఆయన తన పని తాను చేసాడు. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. దర్శకుడు నాని కాసరగడ్డ తనకు ఇచ్చిన పని పూర్తి చేసాడు.. కానీ కథలో షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ చెప్పినంత షో అయితే కనబడలేదు.. రొటీన్ కథనే కానీ మధ్యలో కొన్ని ట్విస్టులు రాసుకున్నాడు. చివర్లో కూడా రొటీన్ ట్విస్ట్‌తోనే సినిమాను ఎండ్ చేసాడు. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. కథతో ఏ మాత్రం సంబంధం లేని ఓ ఎపిసోడ్ కోసం కాశ్మీర్ వరకు వెళ్లారు. దీన్నిబట్టి దర్శకుడిని నిర్మాతలు ఎంతగా నమ్మారో అర్థం చేసుకోవచ్చు. షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ షో పెద్దగా కనబడలేదు..

పంచ్ లైన్:

ఓవరాల్‌గా 12ఏ రైల్వే కాలనీ.. వర్కవుట్ అవ్వని ట్విస్టులు..!

Follow Us
భర్త మరణంతో డీలా పడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసింది.. ఇప్పుడు
భర్త మరణంతో డీలా పడలేదు.. ధైర్యంగా ముందడుగు వేసింది.. ఇప్పుడు
భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణాలు ఇవే
భారత్‌లో పెరిగిపోతున్న స్లీప్ డివోర్స్ కేసులు.. అసలు కారణాలు ఇవే
పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!
పరాభవ నామ సంవత్సరం.. ధనస్సు రాశి వారి ఉగాది రాశిఫలాలు!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. తాగడం ప్రాణాంతకం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర మద్యం బ్రాండ్‌ ఇది.. తాగడం ప్రాణాంతకం
వాడు బ్రహ్మోస్ కంటే డేంజరస్.. అతడి వల్లే కివీస్ ఓటమి
వాడు బ్రహ్మోస్ కంటే డేంజరస్.. అతడి వల్లే కివీస్ ఓటమి
ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!
ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!
అత్యంత అరుదైన ఆపరేషన్.. అతికిన ముక్కలైన చెయ్యి!
అత్యంత అరుదైన ఆపరేషన్.. అతికిన ముక్కలైన చెయ్యి!
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే..
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ కన్నింగ్ ప్లాన్.. కట్‌చేస్తే..
LPG గ్యాస్‌ సిలిండర్ల కొరత.. వంట సమయంలో గ్యాస్‌ ఆదా చేసే టిప్స్!
LPG గ్యాస్‌ సిలిండర్ల కొరత.. వంట సమయంలో గ్యాస్‌ ఆదా చేసే టిప్స్!
తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో మరో 4లైన్ హైవే!
తెలంగాణ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో మరో 4లైన్ హైవే!