Movie Makers: దర్శకుల క్రేజీ థాట్స్.. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న నయా ఫాంటసీ మూవీస్..

ప్రజెంట్ సినిమా మేకింగ్‌లో కొత్త పొకడలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రియలిస్టిక్ సినిమాల జోరు కంటిన్యూ చేస్తూనే.. ప్యారలల్‌గా ఫాంటసీ వరల్డ్‌ను వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమాలతో పాటు..

Movie Makers: దర్శకుల క్రేజీ థాట్స్.. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న నయా ఫాంటసీ మూవీస్..
Movie Makers

Edited By: Shiva Prajapati

Updated on: Jul 22, 2023 | 10:32 PM

ప్రజెంట్ సినిమా మేకింగ్‌లో కొత్త పొకడలు కనిపిస్తున్నాయి. ఓ వైపు రియలిస్టిక్ సినిమాల జోరు కంటిన్యూ చేస్తూనే.. ప్యారలల్‌గా ఫాంటసీ వరల్డ్‌ను వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమాలతో పాటు.. క్రేజీ థాట్స్‌తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నాయి.

కల్కి 2898 టీజర్‌తో హాలీవుడ్ రేంజ్‌ విజువల్ వండర్‌ను ఇండియన్‌ స్క్రీన్ మీద చూపించబోతున్నారు నాగ్‌ అశ్విన్‌. గతంలో ఇండియన్‌ స్క్రీన్ ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ కొత్త జానర్‌లో డిఫరెంట్ మూవీని సిద్ధం చేస్తున్నారు. మరికొంత మంది దర్శకులు కూడా ఇలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు.

బాహుబలి తరువాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలే కాదు.. ఆడియన్స్‌ ఆలోచన కూడా మారిపోయింది. సినిమా అంటే రియల్‌ వరల్డ్ కాదు. రియల్‌ లైఫ్‌లో జరగని ఎన్నో విషయాలు వెండితెర మీద చూపించవచ్చన్న ఒపీనియన్‌కు వచ్చేశారు మన మేకర్స్‌. బాహుబలి సక్సెస్‌తో రీజినల్‌ బౌండరీస్ చెరిగిపోవటంతో ఇంట్రస్టింగ్ ఐడియాస్‌తో తెరకెక్కుతున్న చిన్న సినిమాలతోనూ ఆడియన్స్‌ను ఫాంటసీ వరల్డ్‌లోకి తీసుకెళుతున్నారు.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా రెగ్యులర్‌గా ఆడియన్స్‌ను ఫాంటసీ వరల్డ్‌లోకి తీసుకెళ్తున్నారు. రీసెంట్‌గా జాంబీ కాన్సెప్ట్‌ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ క్రేజీ డైరెక్టర్‌.. నెక్ట్స్ డివైన్‌ థాట్‌తో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. కంప్లీట్‌గా అన్‌ రియల్‌ వరల్డ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తెర మీద రీసెంట్‌ టైమ్స్‌లో వస్తున్న వన్‌ అండ్‌ ఓన్లీ సూపర్‌ హీరో సినిమాగా రికార్డ్ సెట్‌ చేయనుంది.

యంగ్ హీరోలు నిఖిల్‌, కల్యాణ్ రామ్‌ లాంటి వాళ్లు కూడా ఈ జానర్‌ను టచ్‌ చేసి సక్సెస్ అయ్యారు. కార్తికేయ 2తో నిఖిల్‌ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టారు. బింబిసార సినిమాతో కల్యాణ్ రామ్‌ కూడా ఫాంటసీ జానర్‌లో తన మార్క్ చూపించారు.

సౌత్‌ నుంచే కాదు నార్త్ లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర కూడా ఫాంటసీ సబ్జెక్టే. పురాణాల్లో కనిపించే అస్త్రాలు, వాటి కాపాడటం కోసం దివ్య శక్తులున్న హీరో ఎలాంటి పోరాటం చేశారు అన్నదే బ్రహ్మాస్త్ర కథ. ఇప్పటికే తొలి భాగం సూపర్ హిట్ కావటంతో ఈ సినిమా సీక్వెల్‌ మీద కూడా మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..