Pooja Hegde Movies: సాధారణంగా ఓ భారీ ఫ్లాప్ పడితే ఆ హీరోయిన్ కెరీర్‌లో గ్యాప్ రావటం కామన్. కానీ పాన్ ఇండియా డిజాస్టర్ తరువాత కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తన పేరును అలాగే కాపాడుకుంటున్నారు ఓ బుట్టబొమ్మ. ముఖ్యంగా కోలీవుడు స్టార్ హీరోలంతా ఇప్పుడు ఆ బ్యూటీ డేట్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారంటే నమ్మగలరా.. ఇంతకీ ఆ క్రేజీ హీరోయిన్ ఎవరు? తమిళ హీరోలు అంతలా ఎందుకు ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
అల వైకుంఠపురము, అరవింద సమేత లాంటి ఒకట్రెండు హిట్స్ మినహాయిస్తే పూజా హెగ్డే కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అన్న రేంజ్ సినిమాలు పెద్దగా లేవు. అయినా నేషనల్ లెవల్‌లో ఈ బ్యూటీ పుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా రాధేశ్యామ్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఈ డిజాస్టర్‌తో పూజా కెరీర్ గ్రాఫ్ కాస్త కిందకు దిగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే ఆ ఎఫెక్ట్ పూజా హెగ్డే కెరీర్ మీద అస్సలు పడలేదు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలైతే.. పూజాతో జోడి కట్టేందుకు వెయిటింగ్ అంటున్నారు.
లేటెస్ట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే కలిసి నటించారు. పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టరే అయినా… గ్లామర్ పరంగా ఈ సినిమాకు జిగేల్ రాణి హెల్ప్ అయ్యారు. అందుకే పూజాతో మరో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు దళపతి. మరికొంత మంది హీరోలు కూడా విజయ్ ఫాలో అయ్యే పనిలో ఉన్నారు.
పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్..
ప్రజెంట్ గ్లోబల్ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేస్తున్న సూర్య నెక్ట్స్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుస సక్సెస్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న సూర్య.. నెక్ట్స్ కమర్షియల్ డైరెక్టర్ శివతో ఓ సినిమా చేస్తున్నారు. ఊరమాస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్యకు జోడిగా పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉంది.
సూర్య మాత్రమే కాదు.. అజిత్ కూడా తన నెక్ట్స్ సినిమాకు పూజా పేరునే పరిశీలిస్తున్నారు. వలిమై లాంటి బిగ్ హిట్ ఇచ్చిన హెచ్ వినోద్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు అజిత్. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజ పేరునే పరిశీలిస్తున్నారట. ఇలా సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుస ఆఫర్స్‌తో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. ఆ రకంగా నయనతార, సమంతకు పూజా హెగ్డే దక్షిణాదిలోని అన్ని చోట్లా గట్టి పోటీ ఇస్తున్నారు.
పూజా హెగ్డే ఇన్‌స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తలు చదవండి..