Archana Kavi: ప్రముఖ మలయాళ నటితో కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. అసలు విషయమేంటంటే..

అర్చనా.. ఇటీవల తన స్నేహితులతో కలిసి రాత్రిపూట ఆటోలో వస్తోంది.

Archana Kavi: ప్రముఖ మలయాళ నటితో కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. అసలు విషయమేంటంటే..
Archana

Updated on: May 25, 2022 | 8:48 PM

మాలీవుడ్ యాక్టర్, టీవీ యాంకర్ అర్చనా కవి(Archana Kavi) పై ఓ కానిస్టేబుల్ దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ ను విచారించినట్లు తెలుస్తోంది. అర్చనా.. ఇటీవల తన స్నేహితులతో కలిసి రాత్రిపూట ఆటోలో వస్తోంది. ఈ సమయంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ అర్చనా, ఆమె ఫ్రెండ్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. తనకు ఎదురైన అనుభవాన్ని అర్చనా కవి సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసింది. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై కొచ్చి(Kochi) డీసీపీ స్పందించారు.

ఈ ఘటనలో కానిస్టేబుల్ పై అంతర్గత విచారణ జరిపామని, రాత్రి పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ అర్చనా తన ముఖానికి మాస్క్‌ పెట్టుకొని ఉండటంతో గుర్తుపట్టలేకపోయారని అన్నారు. ఓ నటి అయినా, సాధారణ మహిళ అయినా చట్టాన్ని అమలు చేసేవారు దురుసుగా ప్రవర్తించడం ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. పెట్రోలింగ్‌లో భాగంగా వారి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. అతనికి మరోసారి సమన్లు ఇచ్చి, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కొచ్చి డీసీపీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల తన స్నేహితులతో కలిసి రాత్రిపూట వస్తుండగా.. పోలీస్‌ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని అర్చనా కవి సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ తమ పట్ల దారుణంగా ప్రవర్తించాడని, ఆ సమయంలో తాము భయాందోళనకు గురయ్యామని ఆవేదన చెందారు.