మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్‌లాల్. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తునట్టు తెలిపారు. కేరళ ప్రభుత్వం , పోలీసులు కమిటీ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేస్తున్నారని, అంతవరకు ఇండస్ట్రీ పేరును చెడగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను సినీ పెద్దలకు మద్దతిస్తునట్టు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. మలయాళ ఇండస్ట్రీ ఓ కుటుంబంలాంటిదని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమ్మ అసోసియేషన్‌పై ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. మహిళా ఆర్టిస్టులకు వేధించిన వాళ్లకు తప్పకుండా కఠినశిక్షలు పడాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి తాము పోలీసులకు సహకరిస్తామన్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిగా ఉందని.. దానికి టార్గెట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హేమ కమిషన్ నివేదిక విడుదలైన తర్వాత మరియు AMMA అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మోహన్‌లాల్ మీడియాతో మాట్లాడటం ఇదే తొలిసారి. కొంతమంది సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణల రావడంతో మోహన్‌లాల్‌తో సహా అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని సభ్యులందరూ గత వారం ఉమ్మడి రాజీనామా సమర్పించారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు మోహన్‌లాల్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..