
దేశంలో కరోనా (Corona) కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో టాలీవుడ్ (Tollywood) లో మళ్లీ సినిమా జోష్ మొదలైంది. సంక్రాంతికి వాయిదా పడిన సినిమాలన్నీ వరుసగా తమ రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఎఫ్ 3, ఆచార్య, భీమ్లా నాయక్, గని, రాధేశ్యామ్, సర్కారు వారి పాట తదితర భారీ సినిమాలన్నీ తమ విడుదల తేదీలను లాక్ చేసుకున్నాయి. తాజాగా మోహన్ బాబు (Mohan Babu) హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా (son of india) సినిమా విడుదలకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 18న తన సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
కాగా కలెక్షన్ కింగ్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల తేదీని పంచుకున్నారు మోహన్ బాబు ‘ ‘దేశభక్తి ఇతడి రక్తంలోనే ఉంది’ అంటూ సినిమా కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కాగా ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ సంస్థలు సహకారంతో నటుడు మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు.
Patriotism in his blood #SonofIndia??
Grand Release in Theaters on 18th February⚡️
?Maestro #Ilaiyaraaja Musical?on @adityamusic
Proudly produced by @iVishnuManchu & Directed by @ratnababuwriter@24framesfactory #SreeLakshmiPrasannaPictures #SOI?? #SonofIndiaFromFeb18th ? pic.twitter.com/MaVukQlWVo— Mohan Babu M (@themohanbabu) February 2, 2022
Ananya Panday: రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న లైగర్ ముద్దుగుమ్మ.. దీని ధర ఎంతంటే..
Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..