చిరుకు మోహన్‌బాబు బర్త్‌డే గిఫ్ట్.. చూశారా!‌

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబులది ప్రత్యేక అనుబంధం. వీరిద్దరు దాదాపుగా ఒకేసారి సినీ కెరీర్‌ని ప్రారంభించారు.

చిరుకు మోహన్‌బాబు బర్త్‌డే గిఫ్ట్.. చూశారా!‌

Edited By:

Updated on: Aug 23, 2020 | 3:21 PM

Chiranjeevi Birthday Gift: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబులది ప్రత్యేక అనుబంధం. వీరిద్దరు దాదాపుగా ఒకేసారి సినీ కెరీర్‌ని ప్రారంభించారు. అంతేకాదు చిరు హీరోగా, మోహన్‌ బాబు విలన్‌గా నటించిన చిత్రాలకు అప్పట్లో భలే క్రేజ్ ఉండేది. అయితే సినీ కెరీర్‌ని పక్కనపెడితే వీరిద్దరిని టాలీవుడ్‌లో టామ్ అండ్ జెర్రీలుగా అభివర్ణిస్తుంటారు. ఇక పలు బహిరంగ వేదికలపై వీరిద్దరి బ్రొమాన్స్‌ ప్రేక్షకులకు ఎప్పుడూ బోర్ కొట్టనివ్వదు. ఇదంతా పక్కనపెడితే శనివారం చిరంజీవి 65వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా మోహన్ బాబు ఆయనకు ఓ గిఫ్ట్‌ను పంపారు. హార్లీ డేవిస్‌సన్ బైక్‌ని పోలి ఉండే ఓ కళాకృతిని డైలాగ్‌ కింగ్‌, చిరుకు ఇచ్చారు.

దాన్ని సోషల్ మీడియాలో  వెల్లడించిన చిరంజీవి.. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యు” అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ కళాకృతి పక్కన ఓ ఫొటోను తీసుకొన్న చిరు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా ఈ ఇద్దరు ప్రస్తుతం సినిమాల్లో కొనసాగుతుండగా.. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆకాంక్షిస్తున్నారు.

Read More:

‘బిగ్‌బాస్ 4’ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!

నరసరావు పేట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

https://twitter.com/KChiruTweets/status/1297447324495384576/photo/1