AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 ఏళ్ల కెరీర్‌లో ఓ పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు: మహేష్

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. మొదటి రోజే ఈ మూవీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది సరిలేరు నీకెవ్వరు. ఇక ఈ మూవీకి విజయం కావడంతో సినిమా యూనిట్ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు మైండ్ బ్లాక్ సాంగ్ తన కెరీర్‌లోనే గుర్తిండిపోయే పాటగా మిగిలిందని అన్నారు. ‘‘నా 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని […]

20 ఏళ్ల కెరీర్‌లో ఓ పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు: మహేష్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 10:33 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. మొదటి రోజే ఈ మూవీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ దూసుకుపోతోంది సరిలేరు నీకెవ్వరు. ఇక ఈ మూవీకి విజయం కావడంతో సినిమా యూనిట్ సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు మైండ్ బ్లాక్ సాంగ్ తన కెరీర్‌లోనే గుర్తిండిపోయే పాటగా మిగిలిందని అన్నారు.

‘‘నా 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదు. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ పాటకు నాతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాష్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్. సరిలేరు నీకెవ్వరును హిట్ చేసి, గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అని మహేష్ బాబు అన్నారు.

అయితే కెరీర్‌ ప్రారంభంలో బాగానే డ్యాన్స్ వేస్తూ వచ్చిన మహేష్.. ఆ తరువాత మాత్రం డ్యాన్స్ తక్కువగా చేస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో ఆయన డ్యాన్స్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సారి మహేష్ బాబులోని అన్ని టాలెంట్లను వాడుకోవాలని చూసిన అనిల్ రావిపూడి, ఎట్టకేలకు ఒప్పించి మహేష్ చేత డ్యాన్స్ చేయించారు. దీనికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక డాంగ్ డాంగ్ పాటలో కూడా మహేష్ అదరగొట్టారని అభిమానులు అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు డ్యాన్స్‌ను ఇన్నిరోజులు మిస్ అయిన ఆయన అభిమానులు ఈ పాటలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్