AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : గంగవ్వను స్పెషల్ గిఫ్ట్‌‌‌‌‌తో సర్‌ప్రైజ్ చేసిన మెహబూబ్.. ఎమోషనల్ అయిన అవ్వ

బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరిలో హైలెట్ నిలిచింది మాత్రం గంగవ్వే అనే  చెప్పాలి. హౌస్ లో  కుర్ర కంటిస్టెంట్స్ కు పోటీగా అవ్వ కూడా బాగానే ఆడింది.

Bigg Boss 4 : గంగవ్వను స్పెషల్ గిఫ్ట్‌‌‌‌‌తో సర్‌ప్రైజ్ చేసిన మెహబూబ్.. ఎమోషనల్ అయిన అవ్వ
Rajeev Rayala
|

Updated on: Dec 18, 2020 | 6:39 PM

Share

బిగ్ బాస్ సీజన్ 4లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరిలో హైలెట్ నిలిచింది మాత్రం గంగవ్వే అని చెప్పాలి. హౌస్ లో  కుర్ర కంటెస్టెంట్స్  కు పోటీగా అవ్వ కూడా బాగానే ఆడింది. అయితే అనారోగ్య సమస్య కారణంగా హౌస్ నుంచి మధ్యలోనే వచ్చేసింది. హౌస్ లో అమ్మ ప్రేమను పంచిన అవ్వను కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా స్నేహపూర్వకంగా కలుస్తున్నారు. తాజాగా జోరుదార్ సుజాత, గంగవ్వ మెహబూబ్ దిల్ సే ఇంటికి వచ్చారు. గంగవ్వతో సుజాతతో మెహబూబ్ ముచ్చట్లు పెట్టాడు. హౌస్ లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు కంటే బయట చాలా హుషారుగా కనిపిస్తున్నావు అంటూ అవ్వను ప్రశ్నించాడు. దానికి గంగవ్వ తనదైన శైలిలో సమాధానం చెప్పింది.

బిగ్ బాస్ లో  ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చలేదని చెప్పింది అవ్వ. అంతే కాకుండా అమ్మాయిలు చిన్నచిన్న డ్రస్సులు వేసుకోవడంకూడా బాలేదని చెప్పుకొచ్చింది గంగవ్వ.  ఇక గంగవ్వకు మెహబూబ్ స్పెషల్  గిఫ్ట్ ఇచ్చాడు. సుజాత, గంగవ్వకు మధ్య ఓ పోటీ పెట్టాడు మెహబూబ్ అద్దం లేకుండా మేకప్ వేసుకోవాలని చెప్పాడు. గంగవ్వ తన టెక్నిక్ తో మెప్పించింది. దాంతో ఆమెకు గిఫ్ట్ ఇచ్చాడు మెహబూబ్డ్. గిఫ్ట్ ఇచ్చే ముందు గంగవ్వను ఓ ప్రశ్నను అడిగాడు. దానికి గంగవ్వ చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అప్పట్లో పొలం పనులు చేస్తున్న సమయంలో పట్టీలు, కడియాలు తీసు పొలం పనులు చేస్తుంటే ఎవరో ఎత్తుకుపోయారని, అప్పట్లో తన మొగుడు తాగుడుకు బానిసై తన పట్టీలు తీసుకుపోయి ఉంటాడని అంది. అప్పటినుంచి కళ్ళకు పట్టీలు లేకుండా ఉంటున్న అంటూ ఎమోషనల్ అయ్యాయంది. 20 ఏళ్లుగా పాటీలు లేవన్న గంగవ్వకు పట్టీలను గిఫ్ట్ గా ఇచ్చాడు మెహబూబ్. దాంతో అవ్వ ఎమోషనల్ అయ్యాయంది. అవ్వ నీకు ఏం కావాలన్న నన్ను అడుగు నేనున్నా అంటూ మాట ఇచ్చాడు మెహబూబ్. దాంతో మెహబూబ్ ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుంది గంగవ్వ.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.