Godfather: మెగా ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌.. గాడ్‌ ఫాదర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..

Megastar Chiranjeevi: ఆచార్య సినిమాతో మిశ్రమ ఫలితం అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) త్వరలో గాడ్‌ ఫాదర్‌ (Godfather) గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు..

Godfather: మెగా ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌.. గాడ్‌ ఫాదర్‌ మూవీ ఫస్ట్‌ లుక్‌  రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌..
Godfather Movie

Edited By: Ravi Kiran

Updated on: Jul 02, 2022 | 6:59 AM

Megastar Chiranjeevi: ఆచార్య సినిమాతో మిశ్రమ ఫలితం అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) త్వరలో గాడ్‌ ఫాదర్‌ (Godfather) గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. హనుమాన్‌ జంక్షన్‌ ఫేం మోహన్ రాజా ఈ మెగా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్, పూరిజగన్నాథ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్‌వి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి 153వ చిత్రంగా వ‌స్తున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్ డేట్ అందించారు మేక‌ర్స్.

జులై 4న సాయంత్రం 5:45న ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో పాటు ఓ ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక అంబాసిడర్ కారును చూపిస్తూ జోరున వర్షం కురుస్తుంటే చుట్టూ గొడుగులు పట్టుకున్న వ్యక్తులను చూపించారు. ప్రస్తుతం ఈ లుక్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాతో పాటు మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్షన్‌ లో వేదాళ‌మ్ రీమేక్‌ భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు చిరు. కీర్తిసురేశ్ మెగాస్టార్‌కు చెల్లెలిగా నటిస్తోంది. అలాగే కేఎస్ ర‌వీంద్ర (బాబీ) డైరెక్షన్‌లో మెగా 154వ ప్రాజెక్టును చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..