Bheemla Nayak: భీమ్లా నాయక్.. ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తోంది. పవన్ కళ్యాణ్‌కు సరైన కథ దొరికితే ఎలా ఉంటుందో మరోసారి సాటి చెప్పింది భీమ్లా నాయక్ చిత్రం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ను పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రానికి ఏ సినిమా పోటీ లేకపోవడం, శివరాత్రితో కలిపి వారాంతం రావడంతో సినిమా కలెక్షన్లు (Bheemla Nayak Collection) భారీగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్, రానాల నటనతో పాటు థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైలాగ్‌లు, సాగర్ దర్శకత్వం అలా అందరి పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ జాబితాలోకి మెగా స్టార్ చిరంజీవి కూడా వచ్చి చేరారు. భీమ్లా నాయక్ చిత్రంపై తన స్పందనను తెలియచేశారు చిరు. రానా, పవన్ కళ్యాణ్‌లతో సినిమా సెట్స్‌లో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన చిరు.. ‘భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు. నిజంగా ఇది పవర్ తుఫానే’ అంటూ రాసుకొచ్చారు చిరు.
Heartiest Congratulations on the Thumping Success of #BheemlaNayak True Power Storm! ???@PawanKalyan #Trivikram @RanaDaggubati @saagar_chandrak@MusicThaman @MenenNithya @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/a0U1hs8zGV
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 25, 2022
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో భీమ్లా నాయక్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటూ ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, పవర్ స్టార్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా నటించిన నిత్యా మీనన్, రానా సరసన నటించిన సయుంక్త మీనన్ కూడా తమ నటనతో మంచి మార్కులు కొట్టేశారు.
Also Read: RRR Movie: మళ్లీ మొదలవుతోన్న ఆర్.ఆర్.ఆర్ సందడి.. ఈసారి ఏకంగా దుబాయ్‌లో..!
Samyuktha Menon : భీమ్లానాయక్ బ్యూటీకి క్యూకడుతున్న టాలీవుడ్ ఆఫర్లు..
Samyuktha Menon : భీమ్లానాయక్ బ్యూటీకి క్యూకడుతున్న టాలీవుడ్ ఆఫర్లు..