Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..

|

Dec 31, 2021 | 11:35 AM

Ram Charan: సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్‌ పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా నటీనటుల రెమ్యునరేషన్‌ల విషయంలో ఎక్కడలేని వార్తలు వస్తుంటాయి. పలాన హీరో సినిమాకు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు..

Ram Charan: శంకర్‌ సినిమాకు రామ్‌చరణ్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు..? క్లారిటీ ఇచ్చేసిన చెర్రీ..
Follow us on

Ram Charan: సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్‌ పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా నటీనటుల రెమ్యునరేషన్‌ల విషయంలో ఎక్కడలేని వార్తలు వస్తుంటాయి. పలాన హీరో సినిమాకు ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అంటే మరో హీరో అన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు అన్నట్లు వార్తలు వస్తుంటాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఇలాంటి రుమర్స్‌ మరింత ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రెమ్యునరేషన్‌ విషయంలో కూడా ఇలాంటి వార్తలే హల్చల్‌ చేస్తున్నాయి. చెర్రీ ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌తో పాటు ఆచార్య సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.

ఇదిలా ఉంటే శంకర్‌ చిత్రం కోసం రామ్‌ చరణ్‌ ఏకంగా రూ. 100 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడని వార్తలు తెగ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న చెర్రీ వద్ద ఈ వార్తను ప్రస్తావించారు కొందరు విలేకర్లు. దీంతో ఈ విషయమై స్పందించిన చెర్రీ తన రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. ఈ విషయమై చెర్రీ స్పందిస్తూ.. ‘అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా నాకెవరు ఇస్తారు?’ అంటూ సింపుల్‌గా అవన్నీ ఫేక్‌ వార్తలే అని తేల్చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలకు చెక్‌ పెట్టినట్లైంది. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే.

Also Read: Anandayya Medicine: హైకోర్టు మెట్లెక్కిన నెల్లూరు ఆనందయ్య.. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని నివారించాలంటూ పిటిషన్‌.. నేడు విచారణ..

Edible Oil Prices: సామాన్యులకు గుడ్​ న్యూస్.. భారీగా తగ్గిన వంట నూనెల ధరలు

c VIGIL: ఈ విషయం మీకు తెలుసా? ఎన్నికల్లో అక్రమాలకు చెక్ చెప్పే యాప్ ఒకటి ఉంది..దీని గురించి తెలుసుకోండి!