Ponniyin Selvan: కొనసాగుతోన్న పొన్నియిన్‌ సెల్వన్‌ రికార్డుల మోత.. బాలీవుడ్‌ హిట్‌ మూవీని వెనక్కి నెట్టి మరీ..

|

Oct 10, 2022 | 7:47 AM

మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. అంచనాలకు ఏ మాత్రం...

Ponniyin Selvan: కొనసాగుతోన్న పొన్నియిన్‌ సెల్వన్‌ రికార్డుల మోత.. బాలీవుడ్‌ హిట్‌ మూవీని వెనక్కి నెట్టి మరీ..
Ponniyan Selvan Collections
Follow us on

మణిరత్నం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీ కలెక్షన్లను రాబడతూ దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌తో రికార్డు కలెక్షన్లతో సంచనలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక బాలీవుడ్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టింది.

సినిమా విడుదలైన కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 355 కోట్లను రాబట్డం విశేషం. బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని సైతం పొన్నియిన్‌ వెనక్కి నెట్టింది. కశ్మీర్‌ ఫైల్స్‌ రూ. 340 కలెక్ట్ చేయగా పొన్నియిన్‌ ఆ మార్క్‌ను దాటేసి విజయవంతంగా దూసుకుపోతోంది. సినిమా విడుదలై కేవలం 9 రోజులే అవుతుండడం దరిదాపుల్లో మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో పొన్నియిన్‌ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే రెండు పార్టులుగా తెరకెక్కించిన ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ భారీ క్యాస్టింగ్‌ కూడా సినిమాకు కలిసొచ్చిందని చెప్పాలి. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా ఏఆర్‌ రెమహమాన్‌ సంగీతం సమకూర్చారు. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో తెరకెక్కించిన ఈ సినిమాను రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే నవల ఆధారంగా నిర్మించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..