నటి గౌతమి ఇంట్లోకి చొరబడి.. గోడ కింద దాక్కొని.. ఆందోళన కలిగించిన వ్యక్తి
చెన్నైలోని కొట్టివక్కమ్‌లో నటి గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడ ఓ గోడ కింద దాక్కొని ఆందోళన కలిగించాడు
Man entered Gautami house: చెన్నైలోని కొట్టివక్కమ్‌లో నటి గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. అక్కడ ఓ గోడ కింద దాక్కొని ఆందోళన కలిగించాడు. అతడు దాక్కొన్ని ఉన్న విషయాన్ని గమనించిన గౌతమి ఇంట్లో పనిచేసే సతీష్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. (సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి)
దీంతో గౌతమి ఇంటికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశాడు. ఆ వ్యక్తి పేరు పాండియన్ అని, అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ తరువాత బెయిల్‌పై పాండియన్ బయటకు వచ్చేశాడు. గౌతమి ఇంటి పరిసర ప్రాంతాల్లో పాండియన్ సోదరుడు ఉండగా.. అతడిని కలిసేందుకు అతడు అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. (ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమే.. సీఎస్ లేఖకు నిమ్మగడ్డ సమాధానం)