ఓటీటీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ఇరాట్ట ఇక తెలుగులోనూ.. ఎందులో అంటే.

|

Mar 14, 2023 | 9:26 AM

ఇతర భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుండడం ఇటీవల ఒక ట్రెండ్‌లా వస్తోంది. కంటెంట్‌లో సత్తా ఉంటే ఎక్కడైనా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని కొన్ని చిత్రాలు నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలోకే వస్తుంది మలయాళంలో ఇటీవవల వచ్చిన..

ఓటీటీ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ఇరాట్ట ఇక తెలుగులోనూ.. ఎందులో అంటే.
Iratta Movie
Follow us on

ఇతర భాషల్లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలను తెలుగులోనూ విడుదల చేస్తుండడం ఇటీవల ఒక ట్రెండ్‌లా వస్తోంది. కంటెంట్‌లో సత్తా ఉంటే ఎక్కడైనా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని కొన్ని చిత్రాలు నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలోకే వస్తుంది మలయాళంలో ఇటీవవల వచ్చిన ఇరాట్ట అనే మూవీ. జోజూ జార్జ్‌, అంజలి, మనోజ్‌ కె.యు. ఆర్యన్‌ సలీమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రోహిత్‌ ఎం. జి. కృష్ణన్‌ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ మంచి రెస్పాన్స్‌ సంపాదించుకుంది. సినిమాకు మంచి టాక్‌ రావడంతో తెలుగులో ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూశారు.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయనున్నారని అందుకే, డబ్బింగ్ చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. చిత్ర యూనిట్‌ ఇరాట్టను తెలుగులో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళి వెర్షన్‌ మార్చి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగు వెర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో తెలుగు ఓటీటీ లవర్స్‌ పండగ చేసుకుంటున్నారు.

క్రైమ్‌, సస్పన్స్ వంటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఏఎస్‌ఐ ఊహించని విధంగా మరణిస్తాడు. ఇంతకీ ఆ పోలీస్‌ అధికారిని ఎవరు హత్య చేశారు. కేసు ఎలా పరిష్కారం అయ్యింది అనేదే సినిమా కథ. చిత్ర క్లైమాక్స్‌ ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..